Jr.NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవతరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నాడు. బాలయ్య లాంటి స్టార్ హీరో సైతం తెలుగుకు మాత్రమే పరిమితం అయినప్పటికి ఎన్టీఆర్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘దేవర’ (Devara) సినిమాతో పాన్ ఇండియాలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి వార్ 2 (War 2) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పోటీ పడుతూ ఉండటం విశేషం…
Also Read : మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు..చిరంజీవి ట్వీట్ వైరల్!
పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనతో సినిమాలు చేయడానికి కొంత మంది ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నట్టుగా తెలుస్తోంది… త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో ఆయన ఇతర దేశాల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ గుర్తింపు వల్లే ప్రొడ్యూసర్లు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తి చేసిన తర్వాత మిగతా సినిమాలకు కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ అక్కడ కూడా తను పాగా వేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఇక ప్రశాంత్ నీల్ సినిమాని పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.
మరి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయనకు వరల్డ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మరిన్ని భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి…చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో తన కెరీయర్ ను ఎలా బిల్డ్ చేసుకుంటాడు. తద్వారా ప్రస్తుతం తనతో పోటీపడుతున్న తన తోటి హీరోలందరికి తన సినిమాలతో సమాధానం చెబుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : ‘సికిందర్’ ని డామినేట్ చేస్తున్న ‘చావా’..నిన్న ఎంత గ్రాస్ వచ్చిందంటే!