Chhaava Movie : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అద్భుతాలను నెలకొల్పిన చిత్రాలలో ఒకటి ‘చావా'(Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక(Rashmika Mandana) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతుంది. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని కొత్త సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వస్తుండడం విశేషం. థియేటర్స్ లో విడుదలై సరిగ్గా 50 రోజులు పూర్తి అయ్యింది. ఓటీటీ సంస్థ తో కుదిరించుకున్న డీలింగ్ ప్రకారం, ఈ చిత్రాన్ని 50 రోజుల తర్వాత ఓటీటీ లో విడుదల చేయాలి. అందుకే రేపటి నుండి ఈ సినిమా ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో చూడకుండా, ఓటీటీ లో వస్తే చూద్దాం అని అనుకున్న వాళ్లకు ఇది ఒక శుభ వార్త అనొచ్చు.
Also Read : సికిందర్’ ని డామినేట్ చేస్తున్న ‘చావా’..నిన్న ఎంత గ్రాస్ వచ్చిందంటే!
ఈ చిత్రాన్ని విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థకు భారీ రేట్ కి అమ్ముడుపోయింది. రేపటి నుండి అనగా నేడు అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. కేవలం హిందీ భాషలో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఈ చిత్రం కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే విడుదలైంది. తెలుగు వెర్షన్ కూడా మొదట్లో విడుదల కాలేదు. హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన, నాలుగు వారాలు గడిచిన తర్వాత గీత ఆర్ట్స్(Geetha Arts) సంస్థ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) పట్టుబట్టీ ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లోకి డబ్ చేసి విడుదల చేశారు. ఆలస్యం గా విడుదల చేసినప్పటికీ కూడా తెలుగు లో ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఒకవేళ హిందీ వెర్షన్ విడుదలైన రోజునే తెలుగు వెర్షన్ ని కూడా విడుదల చేసి ఉండుంటే, మరో 20 కోట్ల గ్రాస్ అదనంగా వచ్చేదేమో. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా చూడాలని కోరుకున్నారు. కానీ ఆయా ఇండస్ట్రీస్ కి సంబంధించిన నిర్మాతలు ఎవ్వరూ కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసేందుకు మొగ్గు చూపించలేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా ఓటీటీ లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇటీవల కాలం లో ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఏకంగా 15 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యి రికార్డుని సృష్టించింది. ఆ రికార్డుని ‘చావా’ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
Also Read : ‘రాబిన్ హుడ్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్ మారకపోతే కష్టమే!