Chiranjeevi Children: గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఇక సినిమాలతోనే కాకుండా ఇండస్ట్రీ కి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి చిరంజీవి ముందుండి ఆ ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేశావు. ఇక దాసరి నారాయణరావు సైతం ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ చాలా చిన్న సినిమాల విషయంలో పెద్ద ప్రొడ్యూసర్ అనుసరిస్తున్న వైఖరిని తప్పు బట్టి చిన్న సినిమాలు బతికేల చేశాడు…ఆయన తర్వాత ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలి అనే నిర్ణయం వచ్చిన ప్రతిసారి అందరు చిరంజీవి పేరు చెబుతున్నారు. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ను దాసరి గారు క్లియర్ చేశారు కానీ ఇప్పుడు ఎవరు అలాంటి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ఇష్టపడడం లేదు. చిరంజీవి సైతం ఇండస్ట్రీ పెద్దగా ఉంటాడని చెప్పిన కూడా మోహన్ బాబు లాంటి నటుడు వ్యతిరేకించాడు. దాంతో చిరంజీవి సైతం ఇదంతా నాకెందుకు అనుకోని దాని నుంచి సున్నితంగా తప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ను చక్క పెట్టాడు. కానీ తన ఇంట్లో ఉన్న తన బిడ్డల విషయంలో మాత్రం ఫెయిలయ్యాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి చాలా స్ట్రీక్ రూల్స్ పెట్టినప్పటికి వాళ్ళు ఎవరు వాటిని పాటించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. రామ్ చరణ్ చాలా బుద్ధిగా చిరంజీవి చెప్పినట్లుగా వింటూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తున్నాడు. అలాగే చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత సైతం ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారింది. అది కూడా చిరంజీవి చెప్పి పట్టుబట్టి మరి ఇండస్ట్రీలోనే తను ఉండాలనే ఉద్దేశ్యంతోనే మన శంకర్ వరప్రసాద్ సినిమాతో తనను ప్రొడ్యూసర్ గా మార్చాడు. చిరంజీవి చిన్న కూతురు అయిన శ్రీజ మాత్రం ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
ఇద్దరు భర్తలతో కూడా విడిపోవడం వల్ల ఆమెకు మరో పెళ్లి చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట. అయిన కూడా ఆమెకు సంబంధాలు పెద్దగా సెట్ అవ్వడం లేదట. మరి ఎందుకని ఆమె విషయంలో చిరంజీవి ప్రతిసారి ఫెయిలవుతున్నాడు. అంటూ అతని మీద కొన్ని విమర్శలైతే వస్తున్నాయి.
మొదట ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత వాడితో విభేదాలు పెట్టుకొని మళ్లీ చిరంజీవి దగ్గరికి వచ్చేసింది. సెకండ్ టైం కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు. అతన్ని హీరోగా కూడా ప్రమోట్ చేశారు. అయినప్పటికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు.
ఇక మూడో పెళ్లి చేసుకుంటుందా?లేదంటే తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కాలం గడిపేస్తుందా అనేది తెలియాల్సి ఉంది… ఇదంతా చూసిన కొంతమంది విమర్శకులు సైతం చిరంజీవి తన కూతుర్ల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…