Chiranjeevi And Prabhas: ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీ లో ఎప్పుడూ జరగని అద్భుతాన్ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) లు ఆవిష్కరించబోతున్నారా..?, ఈ ఇద్దరి హీరోల అభిమానులకు జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ‘రాజా సాబ్’ చిత్రం జనవరి 9న విడుదల కాబోతుండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు, ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాల మేకర్స్ త్వరలోనే ఒక గ్రాండ్ కామన్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారట.
ఈ ఈవెంట్ కి చిరంజీవి, ప్రభాస్ లు వస్తారు, ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకుంటారట. ఇలా ఒకే సీజన్ లో పోటీ పడుతున్న రెండు సినిమాలకు సంబంధించిన స్టార్స్, ఇలా ఒకే వేదికని షేర్ చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం అనేది గతం లో ఎప్పుడూ కూడా జరగలేదు. మూవీ లవర్స్ కి ఇది ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. వీళ్లిద్దరి ఇలా కలిసి ఒకే వేదిక ని పంచుకోవడానికి మరో కారణం కూడా ఉండొచ్చని అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే వీళ్లిద్దరు కలిసి ‘స్పిరిట్’ చిత్రం లో నటించబోతున్నారని, ఈ విషయాన్నీ ఈ వేదిక పైనే చిరంజీవి చెప్తాడని ఒక రూమర్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే మెగా రెబల్ ఫ్యాన్స్ జీవితాంతం ఈ ఈవెంట్ ని తలచుకొని మురిసిపోవడం ఖాయం. సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి నిలుస్తాడా?, లేదా ప్రభాస్ నిలుస్తాడా అనేది తర్వాత విషయం, ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీ విజన్ లో ఒక్కసారి ఊహించుకోండి చూద్దాం, అదిరిపోయింది కదూ, ఆ అద్భుతమైన మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.