Durandhar Movie Villain Role: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను నమోదు చేస్తూ నెంబర్ 1 స్థానానికి ఎగబాకేందుకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘దురంధర్'(Durandhar Movie). ప్రస్తుతానికి అయితే 850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో ‘కాంతారా 2’ చిత్రం ఈ ఏడాది టాప్ ఇండియన్ గ్రాసర్ స్థానం లో ఉంది. ఈ వీకెండ్ తో దురంధర్ చిత్రం ‘కాంతారా 2’ ని దాటి మొదటి స్థానం లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. క్రిస్మస్ నాటికి ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ కి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కేవలం హిందీ వెర్షన్ నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమాకు కూడా రాలేదు . రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎన్ని అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందో చూడాలి.
ఇకపోతే ఈ సినిమాలో హీరో గా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh) కి ఎంత మంచి పేరొచ్చిందో, విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) కి కూడా అంతే మంచి పేరొచ్చింది. కొంతమంది అయితే ఆయన నటనకు ఫిదా అయిపోయారు. సినిమాలోని ఆయన సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని మీమ్స్ గా వాడేస్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ కోసం అక్షయ్ ఖన్నా కంటే ముందుగా మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ని అడిగారట. ఆయనకు కథ చాలా బాగా నచ్చింది కానీ, ఒకే సమయం లో కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తుండడం వల్ల ఈ సినిమాకు కావాల్సినన్నీ డేట్స్ ఇవ్వలేకపోయాడట. దీంతో ఆ చిత్ర మేకర్స్ అక్షయ్ ఖన్నా ని తీసుకున్నారు. ఒకవేళ నాగార్జున ఒప్పుకొని ఈ సినిమా చేసి ఉండుంటే దేశం మొత్తం ఈరోజు నాగార్జున గురించి మాట్లాడుకునేది.
వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలో తన క్రెడిట్ భాగం సగానికి పైగానే ఉండేది. నాగార్జున కి అసలు సిసలు కం బ్యాక్ లాగా ఉండేది. బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసి కూలీ చిత్రం లో రొటీన్ విలన్ క్యారక్టర్ చేసి తన అభిమానుల చేత చివాట్లు తిన్నాడు. రజినీకాంత్ చేతిలో దెబ్బలు తిని చచ్చిపోయే ఇంతటి రొటీన్ విలన్ క్యారక్టర్ ని నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో, అసలు ఆ డైరెక్టర్ లోకేష్ కి అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో ఇలాంటి క్యారక్టర్ చేయించాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో, ఇప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి అర్థం కానీ విషయం. కానీ ఏది ఏమైనా బంగారం లాంటి అవకాశం ఒక్కసారి చేజారితే మళ్లీ వస్తుందా?, భవిష్యత్తులో అయినా నాగార్జున సినిమాల ఎంపిక పట్ల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.