Bigg Boss 9 Telugu Grand Finale: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) ఏ రేంజ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాల్గవ సీజన్ తర్వాత అంతటి రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ ఈ సీజన్ కి వచ్చింది. కుటుంబ బంధాలు, ఎమోషన్స్ మధ్య ఈ సీజన్ సాగడం తో, మేకర్స్ కూడా స్వతంత్ర టాస్కులకంటే ఎక్కువగా సపోర్టింగ్ టాస్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ కారణం చేత డ్రామా పీక్ రేంజ్ కి వెళ్ళింది. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ కి బ్రహ్మరధం పట్టడం తో రేటింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ప్రతీ వారం ఈ సీజన్ లో 10 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది చెప్పడానికి. ఇది కాసేపు పక్కన పెడితే మరో మూడు రోజుల్లో ఈ సీజన్ ముగియబోతుంది.
టైటిల్ విన్నింగ్ రేస్ నిన్న మొన్నటి వరకు కేవలం తనూజ, పవన్ కళ్యాణ్ మధ్య మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు డిమోన్ పవన్ కూడా వచ్చి చేరాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ ఆదివారం ట్రోఫీ ఎత్తబోతున్నారు. అది ఎవరు అనే ఉత్కంఠ చివరి నిమిషం వరకు ఉంటుంది. అయితే ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడం తో, ముఖ్య అతిథి ని కూడా సీజన్ కి తగ్గట్టు గానే పిలుస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా వస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ చిరంజీవి ఇప్పటికే రెండు సార్లు వచ్చాడు, మళ్లీ ఆయన్నే పిలిస్తే ఆడియన్స్ రొటీన్ ఫీల్ అవుతారేమో అని బిగ్ బాస్ టీం అనుకుందేమో, అందుకే ఈ గ్రాండ్ ఫినాలే కి రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ని పిలిచినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్ ‘ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతుంది. కాబట్టి ఆయన్ని పిలిస్తే రాజా సాబ్ కి ప్రమోషన్ కూడా జరిగినట్టు అవుతుందని ఒప్పించి ఆయన్ని తీసుకొస్తున్నారట. గత సీజన్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. గత సీజన్ కంటే ఆయన మూడు సార్లు బిగ్ బాస్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ రావడం మాత్రం ఇదే తొలిసారి. అసలే బ్లాక్ బస్టర్ సీజన్, టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనే విషయం లో నరాలు తెగేంత ఉత్కంఠ , ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ముఖ్య అతిథి గా వస్తే టీఆర్ఫీ రేటింగ్స్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో మీరే ఊహించుకోవచ్చు. చూడాలి మరి ఈ ఆదివారం ఏమి జరగబోతుంది అనేది.