spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ... బొమ్మ...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: ‘క’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి ‘చెన్నై లవ్ స్టోరీ’ అంటూ ఒక ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ప్రేమలో విఫలమైన నివి(గౌరీ ప్రియ) తన జీవితం అంత అయిపోయింది అని ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటుంది. తాగుడుకు అలవాటు పడుతుంది. ఇక ఇదే సమయంలో సినిమాల మీద ఉన్న పిచ్చి తో ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలని చెన్నై కి వెళ్ళిన స్టీవెన్ శంకర్(కిరణ్ అబ్బవరం)సైతం తన రంగంలో రాణించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే స్టీవెన్ శంకర్ ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నివి తన ఫ్రెండ్స్ అందరు ఒక రూమ్ లో ఉంటారు. ఇక స్టీవెన్ శంకర్ ను సైతం వాళ్లతోనే ఉంచుకుందాం అని డిసైడ్ అయి తనని కూడా వాళ్ల రూమ్ లోనే ఉండమంటారు. ఇక స్టీవెన్ అమాకత్వాన్ని చూసి నివి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది…దానికి శంకర్ కూడా ఓకే అంటాడు. మొత్తానికైతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారా? స్టీవెన్ శంకర్ డైరెక్టర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు రవి ఈ సినిమాను మొదటి నుంచి కూడా డిఫరెంట్ లవ్ స్టోరీ అంటూ ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. మొత్తానికి మిగతా సినిమాల్లోని ప్రేమకథల మాదిరిగానే రొటీన్ గా ఉన్నప్పటికి కొన్ని సన్నివేశాల్లో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు అని చెప్పలేం. కానీ హృదయం మాత్రం ద్రవిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక దర్శకుడు తను ఎంచుకున్న పాయింట్ ను మొదటి నుంచి స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా చెప్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ వచ్చాడు. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ని బాగా రన్ చేసిన దర్శకుడు సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం పూర్తిగా సినిమాను డ్రామాలోకి తీసుకెళ్లాడు.

ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి… ఎవరి జీవితంలో అయినా తొలి ప్రేమ కథ ఒకటే గొప్పది కాదు అనే పాయింట్ ను చాలా స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. నటీనటులు చాలావరకు ప్లస్ అయ్యారు. ప్రతిపాత్రలో ఒక ఇంటెన్స్ ను చూపిస్తూ పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేశారు. దర్శకుడు చేసిన మ్యాజిక్ ఏంటి అంటే ఆ ప్రేమ కథలో ఉన్న ఫీల్ ని చాలా ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. ప్రతిపాత్ర సినిమాకి ఏదో ఒక రకంగా ఉపయోగపడిన క్యారెక్టర్ కావడం విశేషం…అనవసరంగా వచ్చిపోయే క్యారెక్టర్స్ ఏమీ లేవు.

ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది… మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది సాంగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికైతే సినిమాలో ప్రేమ కథ పాతదే అయినా కూడా దానిని కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

కిరణ్ అబ్బవరం డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా గౌరీ ప్రియ అద్భుతమైన నటనను కనబరిచింది. నిజానికి ఆమె చేసిన పాత్రలో వేరే ఏ హీరోయిన్ చేసిన కూడా అంత ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని ఇవ్వకపోయేవారు అనిపిస్తుంది. ప్రతి సీన్ లో కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా నటించింది. కథను ముందుకు తీసుకెళ్లడం ఆమె చాలా వరకు హెల్ప్ అయింది… మిగతా ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. మొత్తానికైతే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లిన వారిలో హీరోయిన్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. ప్రతి సీన్ లో ఆమె డీసెంట్ పెర్ఫార్మెన్స్ ను చూపించింది.

టెక్నికల్ అంశాలు

మణిశర్మ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో మణిశర్మ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన చాలావరకు ఎఫర్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫీల్ గుడ్ మూవీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ కావాలో అలాంటి మ్యూజిక్ అయితే ఆయన ఇచ్చారు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలకు ఆయన బ్యా గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయింది… ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా బాగుంది… కొన్ని సన్నివేశాలను కాస్త షార్ప్ గా చేసి ఉంటే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ గా వచ్చి ఉండేది…

ప్లస్ పాయింట్స్

గౌరీ ప్రియ యాక్టింగ్
మణిశర్మ మ్యూజిక్
ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్

కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించాయి…

సెకండాఫ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది…

రేటింగ్ : 2.5/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper