spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..? టార్గెట్ పెద్దదే..

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నాయి , అంతకు మించి డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే పెళ్లి తర్వాత స్క్రిప్ట్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ లో మినిమం గ్యారంటీ హీరో అని అనిపించుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘K ర్యాంప్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ వివరాలేంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

‘బేబీ’ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత నిర్మాత SKN , సాయి రాజేష్ కలిసి నిర్మించిన చిత్రమిది. పైగా కిరణ్ అబ్బవరం కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడం , సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ చాలా గట్టిగానే జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 13 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 15 కోట్ల 25 లక్షల రూపాయిల బిజినెస్ జరిగిందట. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. హిట్ టాక్ వస్తే , బ్రేక్ ఈవెన్ స్టేటస్ ని అందుకోవడం సులభమే.

కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీ గౌరీ ప్రియా నటించింది. నిన్న హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి , సినిమా పై హైప్ పెంచడం లో ఉపయోగపడ్డాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డీసెంట్ గానే ఉంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యి కి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చూడాలి మరి రేపు ఈ చిత్రానికి నిర్మాతలు చెప్పినంత రేంజ్ ఉందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper