Charmy Puri Jagannadh relationship rumors: ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ తో తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్… హీరో క్యారెక్టరైజేషన్ ని రాయడంలో అతన్ని మించిన వారు ఎవరూ లేరు. ఒక సినిమా స్టోరీ మీదనే కాదు హీరో క్యారెక్టరైజేషన్ మీద కూడా ఆడుతుందని ప్రూవ్ చేసిన దర్శకుడు… అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఏమాత్రం సక్సెస్ లను సాధించడం లేదు. దాంతో ఆయన అభిమానులు చాలా వరకు నిరాశ చెందుతున్నారు. కారణం ఏంటి అంటే ఆయనకి మంచి టాలెంట్ ఉంది. కానీ నిర్లక్ష్యం చేస్తున్నాడు కాబట్టే ఆయన నాసిరకపు కథలతో సినిమాలను చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు పెట్టుబడులు పెట్టి సినిమాలైతే చేస్తున్నారు. మొత్తానికైతే ఛార్మి అతనితోనే ఉంటూ ఆయన చేసే సినిమాల విషయంలోనే ఇన్వాల్వ్ అవుతున్నారు. పూరి డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు మాత్రమే ఆమె ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇతర దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కరుగుతుంది. ఇక పూరి జగన్నాథ్ కి ఆమెకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల్లో కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళిద్దరు సినిమాపరంగా కలిసి ఉన్నప్పటికి, పూరి జగన్నాథ్ మాత్రం ఆమె వల్ల ఫ్యామిలీ పరంగా కూడా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందట… పూరి జగన్నాథ్ ఆమె నుంచి విడిపోవాలని అనుకున్నప్పటికి ఆమెకు 100 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందట.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ లో ఆ నటుడు చనిపోతాడా..? అసలు విషయం చెప్పేసిన హరీష్ శంకర్…
ఏదైనా ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఆ డబ్బు మొత్తాన్ని చెల్లించి తన నుంచి దూరంగా వెళ్లిపోవాలని పూరి జగన్నాథ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్లు చేసిన కొన్ని సినిమాలు ఆడకపోవడం వల్ల ఆయన తన దగ్గర అప్పు చేయాల్సిన అవసరమైతే ఏర్పడిందట. దాని వల్లే ప్రస్తుతానికి కలిసి సినిమాలు చేస్తున్నారు అంతే గాని ఒకరితో ఒకరికి సినిమాలు చేయడం ఇష్టం లేదట.
అయిన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రిలీజ్ అయి సక్సెస్ ని సాధిస్తే వీళ్లకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి పూరి జగన్నాథ్ ఫ్రీ అయిపోవచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…