సుకుమార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్లు.. సందడే సందడి!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఫ్యామిలీతో తార‌లు చేరిపోయారు. సోలోగా కాదు.. విత్ ఫ్యామిలీ! అంద‌రూ కలిసి తెగ సంద‌డి చేశారు. వీరంతా ఓ శుభకార్యానికి హాజ‌ర‌య్యారు. కేవ‌లం న‌టీన‌టులే కాకుండా.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంతా ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రయ్యారు. Also Read: వాళ్ల శోభనం చూసేందుకు భూతద్దం పట్టుకొచ్చారుః నాగ‌బాబు సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి వోణీల ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. బుధవారం సాయంత్రం హైద‌రాబాద్‌ నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘ‌నంగా ఈ వేడుకగా […]

Written By: Bhaskar, Updated On : February 25, 2021 12:43 pm
Follow us on

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఫ్యామిలీతో తార‌లు చేరిపోయారు. సోలోగా కాదు.. విత్ ఫ్యామిలీ! అంద‌రూ కలిసి తెగ సంద‌డి చేశారు. వీరంతా ఓ శుభకార్యానికి హాజ‌ర‌య్యారు. కేవ‌లం న‌టీన‌టులే కాకుండా.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంతా ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రయ్యారు.

Also Read: వాళ్ల శోభనం చూసేందుకు భూతద్దం పట్టుకొచ్చారుః నాగ‌బాబు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి వోణీల ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. బుధవారం సాయంత్రం హైద‌రాబాద్‌ నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘ‌నంగా ఈ వేడుకగా జరిగింది. అట్ట‌హాసంగా వేడుక నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న సుకుమార్‌.. ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులంద‌రినీ ఇన్వైట్ చేశారు.

Also Read: బ‌ట్టలు లేని ఫొటో అడగ్గానే.. న‌గ్న చిత్రం పెట్టేసిన శ్రీముఖి.. పిక్ వైరల్ !

సుక్కూ ఆహ్వానం అందుకున్న వారిలో చాలా మంది కుటుంబంతో క‌లిసి ఈ వేడుక‌కు విచ్చేశారు. మహేశ్‌బాబు-నమ్రత, ఎన్టీఆర్‌-ప్రణతీ, నాగచైతన్య-సమంత దంపతులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరితోపాటు రామ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి, అనుపమ పరమేశ్వరన్‌, కీర్తిసురేశ్ వంటి చాఆలా మంది తార‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

వీరంతా సుకృతిని ఆశీర్వదించారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌తో అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి. తార‌లంతా ఒక్క చోట చేరిన చిత్రాల‌ను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.