Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు దక్కేవి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క నిమిషం కలిసేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతున్న కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయ్యని ప్రయత్నం అంటూ లేదు. మద్యం కుంభకోణం కేసులు అరెస్టులు ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలోనే కేంద్ర పెద్దలను కలిసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం స్కాం విచారణ తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా ఈడి దూకుడు పెంచనుండడంతో జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* గతంలో విజయసాయిరెడ్డి..
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి చక్రం తిప్పే వారు కేంద్రంలో. అప్పట్లో బీజేపీలోని కొంతమంది సీనియర్ నేతలను ఆకర్షించారు. అలా వారి ద్వారా కేంద్ర పెద్దలను జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు 2018లో ఎన్డీఏకు దూరమయ్యారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడమే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఎన్డీఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉండవచ్చు కానీ.. టిడిపికి వదులుకునే స్థితిలో మాత్రం బిజెపి లేదు. అందుకే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం శాఖ మంత్రి అమిత్ షా అప్పాయింట్ పెట్టు లభించడం లేదు.
* మద్యం కుంభకోణంలో..
ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. దాదాపు రూ.3800 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈడి ఎంట్రీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి నోటీసిచ్చి విచారణకు పిలుస్తుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అదే జరిగితే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. ఈ పరిస్థితుల్లో కేంద్ర పెద్దలైన మోడీ, అమిత్ షా లను కలిసి తాను ఇప్పటికీ దగ్గరి మనిషిని అని చెప్పేందుకు.. ఒక రాజకీయ ముద్ర వేసేందుకు.. దర్యాప్తు సంస్థల నుంచి కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది.
* నో ఛాన్స్..
అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డితో కేంద్ర పేదల వ్యవహరించి అవకాశం లేదు. కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఏపీలో పాలన సాగిస్తున్నది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జనసేనలు అన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వంపై అదే ఎన్ డి ఏ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తామంటే పెద్ద లాజిక్ కనిపించడం లేదు. గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించే చాన్స్ లేదు. మరి వైవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.



