ఏపీలో ప్రేమ మర్డర్లను ఎందుకు లైట్‌ తీసుకుంటున్నట్లు..?

‘నాకు దక్కనిది మరెవ్వరికి దక్కద్దు’ అనే ధోరణి ఇప్పుడు యువతలో బాగా పెరిగిపోతోంది. అదో హీరోయిజంలా ఫీలవుతోంది. శ్రద్ధగా చదువుకొని.. లైఫ్‌లో సెటిల్‌ అవ్వాల్సిన ఏజ్‌లో చెడు ధోరణిలో పయనిస్తోంది. తాము ఏం చేసినా పెద్దగా శిక్షపడేదేమీ ఉండదన్న ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ ధోరణి ఏపీలోని యువతలో బాగా కనిపిస్తోంది. ఏపీలో పెడతోవ పట్టిన యువకుల మైండ్లలో ఇది బలంగా స్థిరపడిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రేమ పేరిట అమ్మాయిలపై నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. […]

Written By: Srinivas, Updated On : February 25, 2021 7:44 pm
Follow us on


‘నాకు దక్కనిది మరెవ్వరికి దక్కద్దు’ అనే ధోరణి ఇప్పుడు యువతలో బాగా పెరిగిపోతోంది. అదో హీరోయిజంలా ఫీలవుతోంది. శ్రద్ధగా చదువుకొని.. లైఫ్‌లో సెటిల్‌ అవ్వాల్సిన ఏజ్‌లో చెడు ధోరణిలో పయనిస్తోంది. తాము ఏం చేసినా పెద్దగా శిక్షపడేదేమీ ఉండదన్న ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ ధోరణి ఏపీలోని యువతలో బాగా కనిపిస్తోంది. ఏపీలో పెడతోవ పట్టిన యువకుల మైండ్లలో ఇది బలంగా స్థిరపడిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రేమ పేరిట అమ్మాయిలపై నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

ఇటువంటి వారి పట్ల సంఘటనలు జరిగినప్పుడే సీరియస్‌గా పరిగణిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఏదో కొద్ది రోజులు హడావిడి చేసి వదిలేస్తుండడంతో యువతలో ఆ పెడధోరణి నానాటికీ పెరుగుతోంది. తాజాగా.. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదన్న ఉన్మాదంతో విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు నర్సరావుపేటలో డిగ్రీ విద్యార్థినిని చంపేశాడు. ఈ ఘటనపై సీఎం స్పందించారు. రూ. పది లక్షల సాయం ప్రకటించారు. ఇదే మొదటిదా అంటే కాదు.. విజయవాడ, విశాఖ, అనంతపురం.. ఇలా వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖలో యువతిని గొంతు కోసి చంపేశాడు. అనంతపురం జిల్లాలో ఓ బ్యాంక్ ఉద్యోగినిని చంపేసి కాల్చేశారు. దిశ తరహా ఘటన అది. రాజకీయంగా సంచలనం సృష్టించే సరికి.. భారీగా పరిహారం ఇచ్చి కుటుంబసభ్యుల నోరు మూయించారు. విజయవాడలో దివ్య తేజస్విని హత్య ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు మరో ప్రేమోన్మాది తెగబడ్డాడు.

అన్నిచోట్లా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ.. పోలీసులు చర్యలు తీసుకోకపవడంతో అవి హత్యల వరకూ వెళ్లాయి. ఇక హత్యలు దాకా వెళ్లకుండా దాడుల ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నెలలో సగం రోజులు పరామర్శల యాత్రలు పెట్టుకోవాల్సి వస్తుంది. సత్తెనపల్లిలో ఇలా దాడికి గురైన యువతిని పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రి దిశ చట్టం కింద ముగ్గురికి ఉరేశామని ప్రకటించేసి కలకలం రేపారు. ఆమెను కనీస అవగాహన లేదని తేలిపోయిందన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్మాదం వెర్రితలలు వేస్తోంది. చిన్నారులపై దారుణాల దగ్గర్నుంచి యువతులను నిర్దాక్షిణ్యంగా చంపడం వరకూ.. నిరాటకంగా సాగిపోతున్నాయి. ఎవరికీ భయం అనేది లేకుండా పోయింది.

పొరుగు రాష్ట్రంలో దిశ ఘటన జరిగిందని ఏపీలో దిశ చట్టం చేసిన ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండటంతో తిప్పి పంపారు. ఇప్పుడా చట్టం అమల్లో లేదు. అయినా ఇలాంటి నిందితుల్ని శిక్షించడానికి కఠినమైన చట్టాలున్నాయి. కానీ పోలీసులు మాత్రం నిందితుల్ని శిక్షించడంలో విఫలమవుతున్నారు. కొన్ని కొన్ని రాజకీయ ప్రాధాన్యం ఏర్పడే కేసుల్లో సీఎం పరిహారం ప్రకటిస్తున్నారు. దాంతో మొత్తం వ్యవహారం సైలెన్స్ అవుతోంది. ప్రభుత్వం తరఫున ఇదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే భవిష్యత్తులో మరిన్ని హత్యలు తప్పవేమో. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్