దేశంలోని సామాన్యులకు రోజురోజుకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే గ్యాస్ ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా మరోసారి గ్యాస్ కంపెనీలు ధరలను పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. తాజా పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలు పెరిగింది.
Also Read: రూ.20కే అమెజాన్ ప్రైమ్.. ఓటీపీలతో కొత్తరకం మోసం..?
ఈ నెలలో ఇలా వంట గ్యాస్ ధర పెరగడం మూడవసారి కావడం గమనార్హం. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెరగగా 15వ తేదీన మరో రూ.50, నిన్న మరో 25 రూపాయలు పెరిగింది. నెలరోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు ఏకంగా 100 రూపాయలు పెరగడం గమనార్హం. పెరిగిన ధరలతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.794కు చేరింది.
Also Read: ఆ దేశ కోర్టు సంచలన నిర్ణయం.. విడాకులు తీసుకుంటే ఇంటి పనికి పరిహారం..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ ధరలపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటే మాత్రమే సామాన్యులపై భారం తగ్గే అవకాశం ఉంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సైతం సామాన్యులకు భారం కావడం గమనార్హం. భవిష్యత్తులో పెట్రోల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో సామాన్యులు పెట్రోల్, గ్యాస్ పేరు చెబితే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు గ్యాస్ సబ్సిడీ గతంతో పోలిస్తే తక్కువ మొత్తం జమవుతుందని తెలుస్తోంది. సబ్సిడీ తగ్గడం, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారమవుతోంది. పెరుగుతున్న గ్యాస్ ధరలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.