Star Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతూ పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో మన తెలుగు వాళ్ళ స్టామినా అనేది చాలా వరకు పెరుగుతూ ముందుకు సాగుతుంది. ఇక పాన్ ఇండియా(Pan India)లో కూడా నెంబర్ వన్ ఇండస్ట్రీగా తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Cinima Industry) ని నిలుస్తుందంటూ కొనియాడుతున్న రోజులు వచ్చేశాయి. మరి ఇలాంటి సందర్భంలో మన స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో చాలామంది స్టార్ హీరోలు మంచి కంటెంట్ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే కొంతమంది దర్శకులు మాత్రం సినిమాల్లో కథలేమి లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, కామెడీ సీన్స్ తో సినిమాలను నెట్టుకొస్తున్నారు. మరి దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది అనుకుంటున్నా ప్రతిసారి వీళ్ళు వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఇలాంటి సినిమాల వల్ల ఇండస్ట్రీకి చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చాలా మంచి కంటెంట్ తో చాలా మంది దర్శకులు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఇలాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమాల మీద మరోసారి బ్యాడ్ ఇంపాక్ట్ అయితే ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వీళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. తద్వారా సినిమా ఎలా ప్రేక్షకులను మెప్పించబోతుందనేది తెలియాల్సి ఉంది…మరి ఏది ఏమైనా కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు సైతం సినిమాలో కథ ఉండాల్సిన అవసరం లేదు… స్టార్ హీరో ఉండి ఎలివేషన్స్ ఉంటే సరిపోతుంది. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అని మాట్లాడుతున్నారంటే ప్రొడ్యూసర్లే కథ అవసరం లేదని చెబుతుంటే దర్శకులు మాత్రం కథ మీద ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళు కూడా స్టోరీ ని పెద్దగా పట్టించుకోవడం లేదు…
మరి ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్న క్రమంలో చాలామంది దర్శకులు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో చాలా ఎక్కువ సంవత్సరాల పాటు ఉండడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచిన వాళ్ళు అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడున్న దర్శకులందరూ కూడా డిఫరెంట్ స్టోరీలను రాసుకొని సినిమాలు చేసి ఆయా హీరోలకు ఇండస్ట్రీ హిట్లను అందిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరుకుందాం…