Sankranti Akamanam : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఒక్క సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బందులను పడుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి (Anil ravipudi) లాంటి దర్శకుడు మాత్రం వరుసగా సక్సెస్ సాధిస్తు ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక రీసెంట్ గా వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని రిపీటెడ్ గా సినిమా థియేటర్ కి రప్పిస్తూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పటికే వెంకటేష్ (Venkatesh) లాంటి స్టార్ హీరో సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతు ముందుకు సాగుతున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vastunnam) సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా అలాంటి బాటలోనే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. గత 40 సంవత్సరాల నుంచి ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని ఈ పండక్కి సూపర్ సక్సెస్ ని కొట్టడానికి ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj), సినిమాలను బీట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకి భారీగా థియేటర్లను కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు కేటాయించిన కొన్ని థియేటర్లలో ఆ సినిమాలను తీసేసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి భారీ సక్సెస్ ని అందుకున్న వెంకటేష్ ఇక సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక అలాగే అనిల్ రావిపూడి కెరియర్ లో వరుసగా ఎనిమిదొవ సక్సెస్ ని అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నాడు కాబట్టి ఆ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అనిల్ రావిపూడి సక్సెస్ సాధిస్తే వరుసగా త్రిబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించిన డైరెక్టర్ గా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…