https://oktelugu.com/

Jabardasth Indraja: జబర్దస్త్ జడ్జి ఇంద్రజ అంటే ఆ కమెడియన్ కి ఇంత చులకనా… అంత మాట అనేశాడేంటి? కుష్బూ వార్నింగ్!

Jabardasth Indraja: దశాబ్దానికి పైగా జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. షో ప్రారంభం నుంచి జడ్జి గా అలరించిన రోజా కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో జడ్జిగా వచ్చిన ఇంద్రజ, రోజా ని మరిపించేలా చేసింది. కమెడియన్స్ తో మమేకమై పంచులు, కౌంటర్లు వేసేది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 11, 2024 / 12:42 PM IST

    Bullet Bhaskar calls Indraja aunty

    Follow us on

    Jabardasth Indraja: జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ లేటెస్ట్ స్కిట్ ఆకట్టుకుంటుంది. నటి ఇంద్రజ, ఖుష్భు పై భాస్కర్ వేసిన పంచులు చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఇంద్రజను అలా పిలవడం కుష్బూకి నచ్చలేదు.దాంతో అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన తాజా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది. దశాబ్దానికి పైగా జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. షో ప్రారంభం నుంచి జడ్జి గా అలరించిన రోజా కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకుంది.

    ఆమె స్థానంలో జడ్జిగా వచ్చిన ఇంద్రజ, రోజా ని మరిపించేలా చేసింది. కమెడియన్స్ తో మమేకమై పంచులు, కౌంటర్లు వేసేది. రోజా తర్వాత ఆ సీట్ కి న్యాయం చేసింది ఇంద్రజనే. అయితే ప్రస్తుతానికి ఇంద్రజ జబర్దస్త్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం జడ్జిగా కొనసాగుతుంది. కాగా బుల్లెట్ భాస్కర్ తన లేటెస్ట్ స్కిట్ లో ఇంద్రజ పై సెటైర్లు వేశాడు. స్కిట్ లో భాగంగా భాస్కర్ డైరెక్టర్ కాగా నరేష్ అతనికి అసిస్టెంట్ గా చేశాడు.

    ఫోన్ కాల్ వస్తుంది అన్నా… అని భాస్కర్ తో నరేష్ చెబుతాడు. ఎవరు చేశారు అని అడగ్గా .. ఇంద్రజ అమ్మ అని సమాధానం ఇస్తాడు. ఏంటంట అని భాస్కర్ ప్రశ్నిస్తాడు. మన సినిమాలో ఛాన్స్ కావాలంట అని చెబుతూ ఫోన్ భాస్కర్ చేతికి ఇస్తాడు. భాస్కర్ మాట్లాడుతూ .. ఆ ఇందు ఆంటీ అని సంబోధిస్తాడు. దీంతో అంతా ఆంటీనా అంటూ షాక్ అవుతారు. ఖుష్భు అయితే ఇంద్రజ ఆంటీనా అంటూ ఆశ్చర్యపోతుంది.

    భాస్కర్ ఇంద్రజ కు స్టోరీ చెబుతాడు. మీరేమో నాయనమ్మ, ఖుష్భు గారు అమ్మమ్మ అని అంటాడు. ఇద్దరు బామ్మల ముద్దుల మనవడు సినిమా టైటిల్ అని చెప్పుకొస్తాడు. దీంతో ఖుష్భు స్కోర్ బోర్డు చూపిస్తూ ఇంతకంటే చిన్న నెంబర్ ఉంటే పెట్టండి అంటూ ఇండైరెక్ట్ గా భాస్కర్ కి వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇదంతా కామెడీలో భాగమే. తన కామెడీ టైమింగ్ తో బుల్లెట్ భాస్కర్ స్కిట్ వర్కౌట్ చేశాడు. జడ్జెస్ తో పాటు అంతా తెగ నవ్వేశారు.

    కాగా జబర్దస్త్ కి ఒకప్పటి వైభవం లేదు. స్టార్ కమెడియన్స్, జడ్జెస్ షోని వీడారు. జడ్జి నాగబాబు విబేధాలతో ఆ షో నుండి వైదొలిగారు. మల్లెమాల సంస్థ మీద ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్న రోజా… ఆ కారణంగా జబర్దస్త్ మానేసింది. ఆమె తిరిగి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర… వంటి స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ వదిలేశారు.

    ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టీమ్స్, కమెడియన్స్ లో చాలా వరకు కొత్తవారే. సీనియర్స్ స్థాయిలో వారు నవ్వులు పూయించలేకపోతున్నారు. దాంతో టీఆర్పీ పడిపోయింది. ఎక్స్ట్రా జబర్దస్త్ టైటిల్ తీసేసి జబర్దస్త్ టైటిల్ తో రెండు వారాలు ప్రసారం చేస్తున్నారు. గతంలో జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్స్ గా ఉండేవారు. 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఆమెకు మళ్ళీ తిరిగొచ్చే పరిస్థితి లేదు. ఒక దశలో జబర్దస్త్ ఆపేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ బీట్ చేసింది. అక్కడ హైపర్ ఆది ఉండటం కలిసొచ్చే అంశం.