Crime News: పరాయి మగాడి పై మోజు.. కట్టుకున్న భర్తను భార్య ఏం చేయించిందంటే..

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం గౌతంపూర్ కాలనీకి చెందిన అరిక రమేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో సాహూ ఈశ్వర్ కుమార్ (38), తన భార్య ఎండి రెహానా తో కలిసి జీవిస్తున్నాడు. రెహనా, ఈశ్వర్ కుమార్ గతంలో మతాంతర వివాహం చేసుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 11, 2024 12:28 pm
Follow us on

Crime News: రోజురోజుకు మనుషుల మధ్య బంధాలు బలహీనమవుతున్నాయి. ఆప్యాయతలు, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. దీంతో మనుషులు మర మనుషుల్లాగా మారిపోతున్నారు. అవసరాల కోసం, పర వ్యామోహాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాలు కూడా తీసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పుడు మీరు చదవబోయే కథనం అలాంటిదే. కట్టుకున్న భర్త ఆ భార్యకు చేదనిపించాడు. అతడు ఆమెకు ఒక పురుగులాగా కనిపించాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ భార్య పరాయి మగాడి వ్యామోహం లో ఉంది. భర్తను దూరం పెట్టి అతడితో సరస సల్లాపాలు కొనసాగిస్తోంది. భర్త బయటకు వెళ్లడమే ఆలస్యం అతడిని ఇంటికి పిలిపించుకొని సుఖ సంసారం చేస్తోంది. ఈ విషయం ఆ భర్తకు తెలియడంతో.. భార్య ఒళ్ళు మండిపోయింది. చివరికి ఏం చేసిందంటే..

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం గౌతంపూర్ కాలనీకి చెందిన అరిక రమేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో సాహూ ఈశ్వర్ కుమార్ (38), తన భార్య ఎండి రెహానా తో కలిసి జీవిస్తున్నాడు. రెహనా, ఈశ్వర్ కుమార్ గతంలో మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే రెహనాకు, రమేష్ కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఈశ్వర్ కుమార్ కు తెలియడంతో రెహానాను నిలదీశాడు. అయితే రమేష్ గౌతమ్ పూర్ సింగరేణి నివాస సముదాయంలో అక్రమంగా నివసిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని స్థానికుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో సింగరేణి అధికారులు రమేష్ కుటుంబాన్ని క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించారు. ఇక రెహానా వ్యవహార శైలి నచ్చని ఈశ్వర్ కుమార్ ఆమెతో తరచూ గొడవ పడేవాడు. ఈ విషయాన్ని రెహానా తన ప్రియుడు రమేష్ కు పలుమార్లు చెప్పింది. దీంతో ఎలాగైనా ఈశ్వర్ అడ్డు లేకుండా చేయాలని రమేష్ ను ఆమె రెచ్చగొట్టింది. దీంతో వారిద్దరూ కలిసి ఈశ్వర్ హత్యకు ప్రణాళిక రూపొందించారు.

ఈనెల 6న ఈశ్వర్ కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో రమేష్, అతడి అల్లుడు బట్టు చందు, భార్య ఇందిర కత్తులతో అతనిపై దాడులు చేశారు. భర్త పై దాడులు జరుగుతున్నంత సేపు రెహానా ఇంటి బయట కాపలా కాసింది. గతంలో రమేష్ ఇల్లు ఖాళీ చేయించేందుకు ఈశ్వర్ కారణమయ్యాడని.. అందువల్లే అతడిని హత్య చేశారని ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు రెహానా ప్రయత్నించింది. ఈశ్వర్ కుమార్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఖమ్మంలో ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు . ఈ వ్యవహారంపై కొత్తగూడెం రెండవ పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్ కేసు నమోదు చేశారు.

ఈశ్వర్ భార్యపై అనుమానం రావడంతో ఆమెను విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కాగా, ఈ సంఘటన కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించింది. మొదట్లో పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగిందని పోలీసులు భావించారు. కానీ రెహానాను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త పై వారు దాడి చేస్తున్న సమయంలో రెహానా తనలో తానే బిగ్గరగా నవ్విందట. అటూ ఇటూ తిరుగుతూ గంతులు వేసిందట. విచారణ సమయంలో రెహానా చెబుతున్న విషయాలు చూసి పోలీసులు కూడా విస్తు పోయారట.