Boyapati Srinu: బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని ఈ కాంబో క్రియేట్ చేసింది. ఇక గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా భారీ రికార్డులను సైతం క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2’ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూటగట్టుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమాకి 160 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా 120 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే కొల్లగొట్టింది…
ఒకవైపు బోయపాటి శ్రీను ఈ సినిమా సూపర్ సక్సెస్ అని వీడియోలను పెడుతుంటే మరి కొంత మంది మాత్రం ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదని, బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో దక్కిన మొదటి ఫ్లాప్ సినిమా అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక బాలయ్య సైతం ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ మీద అంత సాటిస్ఫైడ్ గా లేడట. అందువల్లే బాలయ్య ఎక్కడ కూడా పెద్దగా ఫంక్షన్స్ లో కనిపించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ సినిమా డివైడ్ టాక్ ని మూట గట్టుకోవడంతో బాలయ్య తర్వాత గోపీచంద్ మలినేని తో చేయబోతున్న సినిమా కథను సైతం మార్చాలని చెప్పి ఆ సినిమా షూటింగ్ కి కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది… బోయపాటి మాత్రం అఖండ 2 సినిమా కలెక్షన్స్ కి పెంచడానికి మూవీ సక్సెస్ సాధించింది అంటూ తనవంతు ప్రయత్నమైతే చేస్తున్నాడు..మరి ఏది ఏమైనా కూడా సినిమాలో మ్యాటర్ ఉంటే ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయిన సినిమా మౌత్ పబ్లిసిటీతో దూసుకుపోతుంది.
సినిమాలో మ్యాటర్ వీక్ గా ఉంటే మనం ఎంత ప్రమోషన్స్ చేసిన సినిమాని ఆధారించే ప్రేక్షకులు సైతం కరువవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తానికైతే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో అఖండ 2 మొదటి ప్లాప్ సినిమాగా మారింది అంటూ సగటు ప్రేక్షకులందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…