Spirit: 2026వ సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక 2025 వ సంవత్సరంలో స్టార్ హీరోలు ఎవరు పెద్దగా సినిమాలను రిలీజ్ చేయలేదు. కానీ 2026వ సంవత్సరంలో దాదాపు స్టార్ హీరోలందరు వాళ్ళ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు… ఈ సంక్రాంతికి ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో వస్తుండగా, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు… ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా సైతం రిలీజ్ కి సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరీష్ శంకర్’ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దసర కానుకగా ప్రేక్షకుల ను అలరించడానికి సిద్ధమవుతుందట…
ప్రభాస్ – హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా దసర కానుకగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది…ఇక డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా స్పిరిట్ సినిమాను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇక దాదాపు ఈ సంవత్సరంలో స్టార్ హీరోలందరు వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి 2026వ సంవత్సరం సినిమా ప్రేమికులకు సంతోషాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.
ఈ అన్ని సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఈ సంవత్సరం చివర్లో వచ్చిన కూడా ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే కాన్ఫిడెంట్ ను దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగ సైతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా నిర్వహిస్తుండడం విశేషం… ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను సక్సెస్ గా కంప్లీట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగ…
కంప్లీట్ అయిన షెడ్యూల్స్ పట్ల పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇక ఈ సినిమా వస్తే 2026వ సంవత్సరంలో వచ్చిన సినిమాలన్నీ పక్కకు తప్పుకోవాల్సిందేనని ఈ సినిమా 2026 చివర్లో వచ్చిన కూడా రికార్డులు నెలకొల్పుతోందంటూ ప్రభాస్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…