Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli: రాజమౌళి కి ఆ డైరెక్టర్లంటే భయమా? వాళ్ళను డామినేట్ చేయడానికి ఏం చేశాడంటే..?

SS Rajamouli: రాజమౌళి కి ఆ డైరెక్టర్లంటే భయమా? వాళ్ళను డామినేట్ చేయడానికి ఏం చేశాడంటే..?

SS Rajamouli: దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన క్రేజ్ ఇండియా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘వారణాసి’ సినిమాతో మహేష్ బాబు ను సైతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి నుంచి వచ్చే సినిమాలు భారీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడతాయనే విషయం మనకు తెలిసిందే. ఇక తన నుంచి విజువల్ వండర్స్ […]

SS Rajamouli: దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన క్రేజ్ ఇండియా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘వారణాసి’ సినిమాతో మహేష్ బాబు ను సైతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి నుంచి వచ్చే సినిమాలు భారీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడతాయనే విషయం మనకు తెలిసిందే. ఇక తన నుంచి విజువల్ వండర్స్ క్రియేట్ చేయగలిగే సినిమాలు మాత్రమే వస్తాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు తను దూరంగా ఉంటాడు ఒక సందర్భంలో కొంతమంది దర్శకులను చూసి తను భయపడిపోయినట్టుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. సుకుమార్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు అంటే తనకు భయమని రాజమౌళి సైతం పలు సందర్భాల్లో తెలియజేశాడు. వాళ్లు పూర్తి కమర్షియల్ సినిమాలను చేస్తే తను తట్టా బుట్ట సర్దుకోవాల్సిందే అంటూ ఆయన చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ గా మారాయి.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

ఇక సుకుమార్ రంగస్థలం, త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలు వచ్చినప్పుడు సుకుమార్ త్రివిక్రమ్ స్టామినా గురించి మరోసారి రాజమౌళి స్పందించాడు. వాళ్ళిద్దరు మాస్ సినిమాలు చేస్తే వీరెలా ఉంటుందని ఒకప్పుడు నేను చెప్పిన మాటలు నిజమయ్యాయి అంటూ ఆయన మాట్లాడాడు…

అలాంటి రాజమౌళి ఇప్పుడు కమర్షియల్ సినిమా ఫార్మాట్ మొత్తాన్ని మార్చేశాడు. నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, మూడు కామెడీ సీన్లతో సినిమాను నడిపించే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా గ్రాండీయర్ గా చూపించాలనే ఒక స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చాడు. అందుకే రాజమౌళి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా గౌరవమైతే ఉంటుంది.

ఆయన లాంటి సినిమాలను చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు ఇండస్ట్రీలో మరెవరు లేరనేది వాస్తవం… ఇక రాజమౌళి ఎలాంటి సబ్జెక్టుని తీసుకున్న కూడా దాన్ని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. మొదటి నుంచి కూడా తను చేసిన సినిమాలన్నీ ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాలే కావడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper