Balakrishna Vs Thalapathy Vijay: టాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయడానికి అనువైన సీజన్స్ 3 ఉన్నాయి. సంక్రాంతి, వేసవి, దసరా ఈ మూడు సీజన్స్ లో తమ తమ సినిమాలను విడుదల చేయాలని నిర్మాతలు, హీరోలు కోరుకోవడం సహజమే. ఎందుకంటే ఈ సీజన్స్ లో సినిమా యావరేజ్ గా ఉన్న కానీ ఎలాగోలా గట్టెక్కే అవకాశం ఎక్కువ. అందుకే టాలీవుడ్ లో ఈ మూడు సీజన్స్ కి డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది దసరా కి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉండబోతున్నది. పైగా టాలీవుడ్ మార్కెట్ పై తమిళ సినిమా ప్రభావం ఈ సారి గట్టిగా ఉండబోతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవత్ కేసరి అక్టోబర్ 19 రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక అదే డేట్ కి తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా విడుదల కాబోతుంది. గత ఏడాది సూపర్ హిట్ సినిమా విక్రమ్ ను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ నుంచి రాబోతున్న సినిమా కావటంతో టాలీవుడ్ లో లియో మీద అంచనాలు బాగానే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను తెలుగు లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య వర్సెస్ విజయ్ ఫైట్ ఉండబోతుంది.
అదే సమయంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా ని దృష్టిలో పెట్టుకొని రెడీ చేస్తున్నారు. కాకపోతే ఆ సమయానికి వస్తుందో లేదో ఇంకా కంఫర్మ్ అయితే కాలేదు. ఇప్పటికయితే లియో, భగవత్ కేసరి తమతమ బెర్త్ కంఫర్మ్ చేసుకున్నాయి. వీటికి తోడు టైగర్ నాగేశ్వరరావు వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక సినిమాకు ఇబ్బంది తప్పకపోవచ్చు.
ఎందుకంటే దసరా సీజన్ లో రెండు సినిమాలు రిలీజ్ అయితే జస్ట్ యావరేజ్ టాక్ వచ్చిన ఎలాగోలా బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. కానీ మూడో సినిమా వస్తే టాక్ యావరేజ్ ఉన్న సినిమా బోల్తా కొట్టడం ఖాయం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తమ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటే దసరాకు రిలీజ్ చేసుకోవటంలో వచ్చే సమస్య ఏమీ లేదు.