Baby Movie Collection: RRR తర్వాత ఆ రికార్డు ‘బేబీ’ కి మాత్రమే సొంతం..!

మొదటి రోజు 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా, అదే రేంజ్ ఫ్లో ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. వారం రోజుల్లో 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 8 వ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాకి మొదటి రోజు కంటే కాస్త అటు ఇటు గా వసూళ్లను రాబట్టింది, వచ్చే వారం కూడా ఇదే రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : July 22, 2023 4:57 pm

Baby Movie Collection

Follow us on

Baby Movie Collection: రీసెంట్ సమయం లో చిన్న చిత్రంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘బేబీ’. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ హీరోలు గా నటించారు. ప్రతీ హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నటువంటి ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

మొదటి రోజు 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా, అదే రేంజ్ ఫ్లో ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. వారం రోజుల్లో 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 8 వ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాకి మొదటి రోజు కంటే కాస్త అటు ఇటు గా వసూళ్లను రాబట్టింది, వచ్చే వారం కూడా ఇదే రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇది ఇలా సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాలకు మాత్రమే ఇన్ని రోజులు మనం వీకెండ్ తర్వాత ప్రతీ రోజూ రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టడం మనం చూసాం. సంక్రాంతి సినిమాలకు కాకుండా మళ్ళీ ఆ రేంజ్ ట్రెండ్ ని #RRR సినిమా విషయం లో చూసాం. ఇప్పుడు మళ్ళీ ‘బేబీ’ సినిమా విషయం లో చూస్తున్నాము. అవును మీరు వింటున్నది నిజమే, బేబీ చిత్రం మొదటి వారం లో విడుదల రోజు నుండి 7 వ రోజు వరకు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లకు తగ్గకుండా బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేసింది.

ఈమధ్య విడుదలైన ఏ చిత్రం కూడా ఇలాంటి ట్రెండ్ ని చూపించలేదని, బయ్యర్స్ పాలిట వరం లాగ మారి ఈ చిత్రం ద్వారానే అలాంటి ట్రెండ్ ని చూశామని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు 9 రోజులకు గాను 27 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రేపటితో 30 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.