Rajinikanth: రజినీకాంత్ ను తక్కువ అంచనా వేస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ…

Rajinikanth: ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడడానికి కారణం కూడా అదే కావడం విశేషం... ఇక మొత్తానికైతే బాలీవుడ్ మీడియా రజినీకాంత్ విషయంలో ఎప్పుడు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది.

Written By: Gopi, Updated On : June 17, 2024 12:21 pm

Bollywood industry is underestimating Rajinikanth

Follow us on

Rajinikanth: కోలీవుడ్ లో చాలా సంవత్సరాల పాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్ ఆయన సినిమాలనే కాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఆయన్ని ఎవ్వరికీ అందనంత స్థాయి లో నిలబెట్టడంలో చాలావరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.

ఇక ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడడానికి కారణం కూడా అదే కావడం విశేషం… ఇక మొత్తానికైతే బాలీవుడ్ మీడియా రజినీకాంత్ విషయంలో ఎప్పుడు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన రోబో సినిమా విషయంలో కూడా వాళ్ళు చాలా వరకు అతన్ని తగ్గించి మాట్లాడారు. అప్పటికి రజనీకాంత్ ఎప్పుడు కూడా వాటిని విమర్శలుగా తీసుకొని వాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూ వస్తున్నాడు.

Also Read: Puri Jagannadh: పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న పాన్ ఇండియా హీరో…

ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమా మీద కూడా వాళ్ళు మరొకసారి కొన్ని వ్యంగ్యమైన మాటలైతే మాట్లాడుతున్నారు. ఇక రజనీకాంత్ ను ఉద్దేశించి ఈ ఏజ్ లో సోలో హీరోగా చేసేకంటే, సపోర్టింగ్ క్యారెక్టర్ లో గాని లేదంటే మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కదా అంటూ వాళ్లు రజనీకాంత్ మీద కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు. కానీ 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన అంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఇక ఇంతకు ముందు సినిమాలను పక్కన పెడితే ఇక వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో మన సౌత్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నారు.

Also Read: Kubera Movie: కుబేర సినిమా లో నాగార్జున పాత్ర ఏంటో తెలిసిపోయింది…

ఇక ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇప్పటినుంచి జరిగేది మరొక లెక్క అనేలా మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి మన సినిమా వెళ్ళబోతుంది అనేది మాత్రం పక్కాగా చెప్పాల్సిన విషయమే…ఇక రజినీకాంత్ ఇప్పుడు జైలర్ 2, కూలీ రెండు సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ మీద తన పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…