https://oktelugu.com/

Puri Jagannadh: పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న పాన్ ఇండియా హీరో…

Puri Jagannadh: ప్రస్తుతం రామ్ ను హీరోగా పెట్టి 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 12:14 PM IST

    Yash is interested in doing a film with Puri Jagannadh

    Follow us on

    Puri Jagannadh: పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేసి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఈయన చేసిన ఫస్ట్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా ఆయన కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన వెను తిరిగి చూడకుండా వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ప్రస్తుతం రామ్ ను హీరోగా పెట్టి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే గత చిత్రమైన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో పూరి జగన్నాథ్ పైన చాలా విమర్శలైతే వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Kantara 2: కాంతర 2 లో మరో కన్నడ స్టార్ హీరో… అంచనాలు పెంచుతున్న అప్డేట్…

    ఇక ఇదిలా ఉంటే పూరి తో సినిమా చేయడానికి కన్నడ స్టార్ హీరో అయిన యశ్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో యశ్ తో సినిమా చేసి స్టార్ట్ డైరెక్టర్ ఎవరు లేరు. కాబట్టి పూరి జగన్నాథ్ అయితే తన స్టామినా ను వాడుకొని తనకు ఒక కొత్త రకమైన స్టైల్ ని ఏర్పాటు చేస్తారనే ఉద్దేశ్యం తోనే పూరి జగన్నాధ్ ను సెలెక్ట్ చేసుకొని ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Tollywood: ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ హీరోల పరిస్థితి ఏంటి..?

    ఇక పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమా పూర్తి అయిన వెంటనే యశ్ తో చేసే సినిమా పనిలో బిజీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమాలు పెద్దగా బజ్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాయి. ఇక దానికి కారణం ఆయన స్టార్ డైరెక్టర్ లతో తన కాంబో ను సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఇక దానివల్లే ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన సినిమాలు మాత్రం అంత బజ్ ను క్రియేట్ చేసుకోవడం లేదు…