Rajanna Sircilla: రాళ్లు కాదు.. చరిత్రను తెలిపే శిల్పాలు.. బయటపడ్డ చారిత్రక అద్భుతాలివీ

గ్రామంలోని విగ్రహాలను అక్కడి ప్రజలు వీర హనుమాన్‌ భావిస్తారు. పురాతన శాసనాలు లభించకపోవడతో కళాకృతులు ఏ కాలానికి చెందినవో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 12:24 pm

Rajanna Sircilla

Follow us on

Rajanna Sircilla: భారత చరిత్ర ప్రపంచలోనే అత్యంత పురాతనమైదని. వేల ఏళ్ల క్రితమే భారత దేశంలో మానవ ఆనవాళ్లు ఉన్నాయనడానికి ఇప్పటికే అనేక ఆధారులు లభించాయి. ఇప్పటికీ మన చరిత్రను తెలిపే కట్టడాలు, వస్తువులు, శిల్పాలు బయటపడుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన శిల్పాలు వెలుగులోకి వచ్చాయి.

అరుదైన ఆనవాళ్లు..
తాజాగా లభించిన వీరగల్లు శిల్పాలు, చిట్టెపు రాళ్ల కుప్పలు, 11 బావులు, నెత్తురు బండలు వంటి చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయనే చెప్పకనే చెబుతున్నాయి. సాధారణంగా ఒకే విగ్రహంపై చెక్కబడిన వీరగల్లు విగ్రహాలు కనిపిస్తుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని వీర్నపల్లి మండలంలో మాత్రం 6 బండరాళ్లపై వీరగల్లు ప్రతిరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలా వారి పేరుమీదుగానే ఆ వీరులపల్లి కాలక్రమంలో వీర్నపల్లిగా మారిందని గ్రామానికి చెందిన వృద్ధలు చెబుతున్నారు.

వీర హనుమాన్‌గా భావిస్తూ..
గ్రామంలోని విగ్రహాలను అక్కడి ప్రజలు వీర హనుమాన్‌ భావిస్తారు. పురాతన శాసనాలు లభించకపోవడతో కళాకృతులు ఏ కాలానికి చెందినవో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. రాళ్లపై చెక్కబడిన రూపాల్లో సిగ ముడిచిన యోధుల ఖడ్గం, విల్లు అమ్ములపొది, ఈటె వంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి ఇనుముతో ఆయుధాలను తయారీ చేసే క్రమంలో వ్యర్ధాలుగా మారే చిట్టెపు రాళ్ల కుప్పలు సైతం ఈ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తుంటాయి. నాటి చారిత్రక ఆనవాళ్లు ప్రస్తుతం కళ తప్పుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

రైతుల పొలాల్లో..
ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక పురావస్తు విగ్రహాలు, శిలలు రైతుల పొలాల్లోని బయటకు తీసినవే. పురావస్తు శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్న పురాతన శిల్పాలను, శిలలన సంరక్షించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికే శిథిలం..
ఇదిలా ఉండగా, నిలబడి ఉంచిన విగ్రహాలు ప్రస్తుతం ధ్వంసమవుతున్నాయి. పగుళ్లు వచ్చాయి. వీటిని సంరక్షిస్తే భవిష్యత్‌ తరాలు వీక్షించి చరిత్రను తెలసుకునే అవకాశం ఉంటుందని వీర్నపల్లి ప్రజలు, రైతులు పేర్కొంటున్నారు. చారిత్ర ఆనవాళ్లు, చరిత్ర గుర్తులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేస్తున్నారు.