Kubera Movie: కుబేర సినిమా లో నాగార్జున పాత్ర ఏంటో తెలిసిపోయింది…

Kubera Movie: ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By: Gopi, Updated On : June 17, 2024 12:09 pm

Nagarjuna role revealed in Kubera movie

Follow us on

Kubera Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల..కమర్షియల్ సినిమాలకు తను చాలా దూరంగా ఉంటాడు. నిజానికి స్లో నరేషన్ తో ఆయన సినిమాని తెరకెక్కించినప్పటికీ అందులో ప్రేక్షకుడికి నచ్చే అంశాలను పెడుతూ ఒక మూడునైతే క్రియేట్ చేయడంలో తను ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు.

ఇక అందుకే ఆయన నుంచి ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ఈ సినిమాలో స్కూల్ టీచర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Kantara 2: కాంతర 2 లో మరో కన్నడ స్టార్ హీరో… అంచనాలు పెంచుతున్న అప్డేట్…

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ధనుష్ కూడా తన మార్కెట్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక నాగార్జున కూడా చాలా రోజుల నుంచి ఫ్లాప్ ల్లో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు. ఇలా ముగ్గురి లక్ష్యం కూడా సక్సెస్ ఒకటే కాబట్టి వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడి పనిచేస్తూ ఈ సినిమాకి ది బెస్ట్ ఔట్ పుట్ ను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Tollywood: ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ హీరోల పరిస్థితి ఏంటి..?

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వాళ్ళు భారీ సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి శేఖర్ కమ్ముల ఈ సినిమా తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల లీడర్ 2 సినిమాను కూడా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు…