Bangladesh Vs Nepal: ఏకంగా దక్షిణాఫ్రికా రికార్డును బ్రేక్ చేసి షాకిచ్చిన బంగ్లాదేశ్..

107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు, 19.2 ఓవర్లలోనే 85 పరుగులకు చాప చుట్టేసింది. బంగ్లాదేశ్ బౌలర్ తన్జీమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 12:19 pm

Bangladesh Vs Nepal

Follow us on

Bangladesh Vs Nepal: టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సూపర్ -8 లోకి ప్రవేశించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. గెలిచి చూపించింది.. ఇదే దశలో సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. వెస్టిండీస్ లోని కింగ్స్ టౌన్ వేదికగా నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ విజయం ద్వారా తదుపరి దశకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసి, 106 పరుగులకే కుప్పకూలింది. వాస్తవానికి తనకంటే ర్యాంకుల పరంగా, ఆటపరంగా తక్కువ స్థాయి జట్టైనా నేపాల్ పై బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధిస్తుందని అందరనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు పెవిలియన్ చేరేందుకు పోటీపడ్డారు. నేపాల్ బౌలర్ల చేతిలో చిగురుటాకులా వణికిపోయారు.. 19.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ 106 పరుగులకు కుప్పకూలిందంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్ 17 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లు రిషాద్ 13, తస్కిన్ అహ్మద్ 12 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరు గనక ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకపోతే, బంగ్లాదేశ్ 90 పరుగులకే కుప్పకూలేది. నేపాల్ బౌలర్లలో సోంపాల్, సందీప్, రోహిత్, దీపేంద్ర తల రెండు వికెట్లు పడగొట్టారు.

107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు, 19.2 ఓవర్లలోనే 85 పరుగులకు చాప చుట్టేసింది. బంగ్లాదేశ్ బౌలర్ తన్జీమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. నేపాల్ జట్టును 85 పరుగులకే కుప్ప కూల్చడం ద్వారా.. బంగ్లాదేశ్ అర్థమైన రికార్డు సృష్టించింది. టి20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ కాపాడుకున్న టీం గా ఘనత సాధించింది. 107 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బంగ్లా బౌలర్ తన్జీమ్ తీవ్ర కృషి చేశాడు. మైదానంలో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు, 21 బంతులను డాట్ గా సంధించడం విశేషం. పైగా రెండు మేయిడిన్ ఓవర్లు వేసి ఆకట్టుకున్నాడు. ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి, నాలుగు వికెట్లు నెల కూల్చాడు.

టి20 క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగులను కాపాడుకున్న లిస్టులో బంగ్లాదేశ్ తర్వాత రెండు స్థానాల్లో దక్షిణాఫ్రికా ఉంది. బంగ్లాదేశ్ జట్టుపై 114 పరుగుల లక్ష్యాన్ని, నేపాల్ పై 116 పరుగుల టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా కాపాడుకుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లోనే చోటు చేసుకోవడం విశేషం. బంగ్లా, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానంలో శ్రీలంక కొనసాగుతోంది. 2014లో న్యూజిలాండ్ జట్టుపై 120 పరుగులు చేసిన శ్రీలంక.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఐదో స్థానంలో భారత్ ఉంది. 2024 లో పాకిస్తాన్ జట్టుపై 120 పరుగుల లక్ష్యాన్ని భారత్ డిఫెండ్ చేసుకుంది.