Varun Dhawan: ఈమధ్య కొంతమంది స్టార్ హీరోయిన్లు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ కాకుండా, వైవిధ్య భరితమైన రోల్స్ చేస్తూ నేటి తరం ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈమె కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే, నాగ చైతన్య పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అని విభజించవచ్చు. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత ఈమె రోటిన్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ‘ఓ బేబీ’, ‘యశోద’ వంటి సూపర్ హిట్స్ ని కూడా అందుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా విలన్ రోల్స్ చేసేందుకు కూడా ఈమె ముందు ఉండేది.
’10 ఎండ్రకుల్లా’, ‘సూపర్ డీలక్స్’ మరియు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వంటి చిత్రాల్లో ఆమె విలన్ రోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన విలన్ రోల్ కి నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది. ఈ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే ఇప్పుడు సమంత తో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. వచ్చే నెల 7వ తారీఖున ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. హాలీవుడ్ రిచర్డ్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్. ఇందులో ప్రియాంక చోప్రా క్యారక్టర్ ని సమంత చేయగా, రిచర్డ్ క్యారక్టర్ ని వరుణ్ ధావన్ చేసాడు. ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేయగా, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమంత ని భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ సిరీస్ విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ వరుణ్ ధావన్, సమంత ఫుల్ బిజీ గా ఉన్నారు.
అందులో భాగంగా వరుణ్ ధావన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘సమంత తో కలిసి నటించొద్దు అని నాతో చాలా మంది చెప్పారు. ఎందుకంటే ఆమెకు హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంది, ఆమెతో కలిసి చేస్తే క్రేజ్ మొత్తం ఆమెనే లాగేసుకుంటుంది కానీ, హీరోలకు గుర్తింపు ఉండదు అని చెప్పేవారు. కానీ నేను ఛాలెంజ్ గా తీసుకొని ఆమెతో కలిసి నటించాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తో తన అద్భుతమైన నటనతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న సమంత, ఇప్పుడు ‘సిటాడెల్’ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతుందో చూడాలి. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.