Allu Arjun : అల్లు అర్జున్ పరువు పోయిందా..? నార్త్ నుంచి వచ్చిన వ్యక్తి తన అభిమాని కాదా..? అసలేం జరిగింది..?

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అల్లుఅర్జున్ ఒకరు...అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడాని కివంగ సిద్ధం చేసుకుంటున్నాడు....

Written By: Gopi, Updated On : October 19, 2024 4:53 pm

Has Allu Arjun lost his reputation? Is the person from North his fan? What actually happened..?

Follow us on

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అల్లు అర్జున్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ మధ్య ఆయన పేరు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక పుష్ప సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులను మ్యాజిక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక అభిమాని 1600 కిలోమీటర్లు సైకిల్ మీద ట్రావెల్ చేసి మరి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి అతన్ని కలిశాడు. ఇక ఇదంతా చూసిన జనాలు అతను అల్లు అర్జున్ వీర అభిమాని అని అందరు అనుకుంటున్నారు. నిజానికి ఆయన 1600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హైదరాబాద్ కి రాగానే అల్లు అర్జున్ టీం అతన్ని దగ్గరుండి మరి అల్లు అర్జున్ దగ్గరికి తీసుకెళ్లారు. నిజానికైతే ఆయన అల్లు అర్జున్ అభిమాని కాదు.

అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇక ఆ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ లో భాగంగా సౌత్ లో భారీ పాపులారిటీని సంపాదించుకున్న కొంతమంది హీరోలను కలవడానికి ఆయన సైకిల్ యాత్ర చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలా చేసి తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేస్తే భారీ వ్యూస్ వస్తాయమే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేసినట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఆయన లిస్టులో అల్లు అర్జున్ తో పాటు కేజీఎఫ్ తో సూపర్ స్టార్ అయిన యశ్, అలాగే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు మరి వాళ్ళని అందర్నీ కలిసిన ఆయన స్పెషల్ గా అల్లు అర్జున్ అభిమాని అని మాత్రమే వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు నిజానికి ఆయన అల్లు అర్జున్ అభిమాని అయితే కాదని చాలామంది సోషల్ మీడియాలో చాలా పోస్టులైతే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొంతమంది సినీ విమర్శకులు సైతం అల్లు అర్జున్ అతన్ని తన అభిమాని అనుకున్నాడని కానీ ఆయన మాత్రం ఎవరి అభిమాని కాదని సినీ విమర్శకులు గట్టిగా చెబుతున్నారు.

మరి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ సైతం అల్లు అర్జున్ పరువు పోయింది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తో భారీ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు…