Pawan Kalyan: పవన్ కళ్యాణ్,శంకర్ కాంబినేషన్ 2 సార్లు మిస్ అయ్యిందా..? ఆ సినిమాలేంటో తెలిస్తే అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేరు!

పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరో గా, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో '3 ఇడియట్స్' అనే చిత్రం తెరకెక్కింది. ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.

Written By: Vicky, Updated On : October 19, 2024 4:31 pm

Pawan kalyan

Follow us on

Pawan Kalyan: ఇండియా లో ప్రతీ సూపర్ స్టార్ కి కొంతమంది డైరెక్టర్స్ తో కచ్చితంగా పనిచేయాలనే కోరిక ఉంటుంది. అలాంటి స్థాయి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న దర్శకులలో ఒకడు శంకర్. రాజమౌళి నేటి తరానికి పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో నెంబర్ 1 అయ్యుండొచ్చు. కానీ మూడు దశాబ్దాల నుండి శంకర్ పాన్ ఇండియన్ సినిమాని ఏలుతూ వస్తున్నాడు. మన చిన్నతనం లో ఉన్నప్పుడే మూడు తరాలకు సరిపడా అడ్వాన్స్ ఆలోచనలతో ఆయన సినిమాల కాన్సెప్ట్స్ ఉండేవి. టెక్నాలజీ పరంగా కానీ, కాన్సెప్ట్స్ పరంగా కానీ శంకర్ మేకింగ్ కి దరిదాపుల్లో వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. అలాంటి లెజెండ్ కాబట్టే ప్రతీ సూపర్ స్టార్ ఆయనతో కలిసి ఒక్క సినిమాకి అయినా పని చేయాలని కోరుకుంటారు. అయితే శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ రెండు సార్లు నటించే అవకాశాన్ని కోల్పోయాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా..?.

పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరో గా, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో ‘3 ఇడియట్స్’ అనే చిత్రం తెరకెక్కింది. ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆరోజుల్లో 500 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ రేట్స్ తో కొలిచి చూస్తే 2000 కోట్ల రూపాయలకు పైమాటే అని చెప్పొచ్చు. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కి అమితంగా నచ్చింది. నాచడంతోనే ఆయన సరిపెట్టలేదు, దీనిని సౌత్ సూపర్ స్టార్స్ లో ఎవరో ఒకరితో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు రీమేక్స్ చేయడు అనే విషయం అందరికీ తెలిసిందే. శంకర్ లాంటి డైరెక్టర్ అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని సంప్రదించాడు. పవన్ కళ్యాణ్ అమీర్ ఖాన్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం కష్టం, ఇది వర్కౌట్ అవ్వదు సార్ అని చెప్పి సున్నితంగా రిజెక్ట్ చేసాడట.

ఇక శంకర్ చివరికి తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఈ చిత్రాన్ని చేసాడు. కమర్షియల్ గా యావరేజ్ గా మిగిలింది ఈ చిత్రం. అలా పవన్ కళ్యాణ్, శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా మిస్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టోరీ చేయాలని ముందుగా ఆయన అనుకున్నప్పుడు, నిర్మాత దిల్ రాజు తో పవన్ కళ్యాణ్ తో చేద్దాం అని చెప్పాడట. అప్పుడు దిల్ రాజు, ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందని చెప్పి, రామ్ చరణ్ ని ఫైనల్ చేసాడట. అలా ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో నుండి రామ్ చరణ్ కి వెళ్ళింది. అలా రెండు సార్లు ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. భవిష్యత్తులో అయినా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి.