Akshay Kumar : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ప్రస్తుతం తమదైన రీతిలో సక్సెస్ సాధించాలని కఠోర శ్రమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్ ని ఆదుకునే నాధుడు లేకుండా పోయాడనే ఉద్దేశ్యం తోనే అక్కడున్న జనాలుగాని,హీరోలుగాని తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం బాలీవుడ్ జనాలు సైతం వీళ్ళ సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వాళ్ళను మెప్పించే సినిమాలను ఆ హీరోలు చేయలేకపోతున్నారు.
ఇక ఇదిలా ఉంటే సంవత్సరానికి దాదాపు 5 నుంచి 6 సినిమాల వరకు రిలీజ్ చేసే అక్షయ్ కుమార్ చేసిన గత 10 సినిమాల్లో కూడా కేవలం రెండు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన 8 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్షయ్ కుమార్ సుధ కొంగర డైరెక్షన్ లో ‘సర్ఫిరా ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో సూర్య హీరోగా వచ్చిన ‘సురారైపోట్రు ‘ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దు రా’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది…ఇక ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ఆయన రీసెంట్ గా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.
ఇక అక్షయ్ కుమార్ గత కొన్ని రోజుల నుంచి తన ఫెయిల్యూర్స్ ని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఇలాంటి వాతావరణాన్ని తను ఎక్కడ చూడలేదని చెప్పుకొచ్చాడు. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఒక వైఖరి మనకు కనిపిస్తుంది. కానీ సినిమా రంగంలో కూడా ఇలాంటి వైఖరి కనిపించడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అంటూ తను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నాడు. ఒకప్పుడు నేను సక్సెస్ లో ఉన్నప్పుడు చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారని చెప్పాడు… ఆయన ఒక్క సంవత్సరంలోనే దాదాపు 7 నుంచి 8 సినిమాల వరకు రిలీజ్ చేస్తాడని కూడా చెప్పాడు. తనకు వర్క్ తప్ప మరి ఏమి తెలియదని చాలా వరకు తను షూటింగ్ లోనే పాల్గొంటూ సినిమాలను ఎంత తొందరగా ఫినిష్ చేయాలనేది మాత్రమే ఆలోచిస్తానని చెప్పాడు.
నిజానికి అక్షయ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన ఎక్కువ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. దానివల్ల దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేస్తే తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు తద్వారా కొన్ని ప్రాఫిట్స్ ని కూడా పొందొచ్చు అని ఆలోచిస్తుంటారు. అందువల్లే ఆయనకి ఎక్కువ సినిమాలు వస్తున్నాయని దాన్ని ఓర్వలేక కొంతమంది కావాలనే తన సినిమాలు ఫ్లాప్ అయితే ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు అంటూ తను తెలియజేశాడు. ఇక మొత్తానికైతే కొంతమంది ఆయన మీద కుట్ర చేస్తున్నారు అని కూడా చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన 17 సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో తెలుగులో విష్ణు హీరోగా వస్తున్న ‘ కన్నప్ప ‘ సినిమా ఒకటి కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ ప్రస్తుతం తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఆయన తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నంలో భాగంగా తెలుగు డైరెక్టర్ లతో స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరీ తను అనుకున్నట్టుగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు తన చూపులు పడుతున్నాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఆయన కొంతమంది తెలుగు దర్శకులతో చేస్తున్న చర్చలు ఫలిస్తాయా లేదా అనేది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Bollywood hero akshay kumar feels that he is enjoying my flops