https://oktelugu.com/

Bollywood Directors For Ram Charan: చరణ్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ డైరెక్టర్లు.. త్వరలోనే అభిమానులకు ఒక్క సంచలన ప్రకటన

Bollywood Directors For Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో సెన్సషనల్ హిట్ అవ్వడం తో ఈ సినిమా లో రామరాజు గా నటించిన రామ్ చరణ్ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాలీవుడ్ జనాలకు మన హిందూ దేవుళ్ళు అన్నా, హిందూ సంప్రదాయాలు అన్నా ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరైనా హిందూ దేవుళ్ళకి సంబంధించిన పాత్రలు కానీ..మన సంస్కృతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 / 12:58 PM IST
    Follow us on

    Bollywood Directors For Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో సెన్సషనల్ హిట్ అవ్వడం తో ఈ సినిమా లో రామరాజు గా నటించిన రామ్ చరణ్ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాలీవుడ్ జనాలకు మన హిందూ దేవుళ్ళు అన్నా, హిందూ సంప్రదాయాలు అన్నా ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరైనా హిందూ దేవుళ్ళకి సంబంధించిన పాత్రలు కానీ..మన సంస్కృతి గొప్పతనం గురించి తెలియచేసే సినిమాలు కానీ..ఎవ్వరైనా తీస్తే ఉత్తరాది ప్రేక్షకులు ఆ సినిమాలను..అందులో పని చేసిన నటులను నెత్తిన పెట్టుకుంటారు..#RRR మూవీ లో అల్లూరి సీత రామ రాజు గెటప్ లో కనిపించిన రామ్ చరణ్ ని వాళ్ళు శ్రీ రాముని లుక్ తో పోల్చుకున్నారు..కాషాయ వస్త్రం లో ధనుస్సుని ధరించిన రామ్ చరణ్ వెండితెర మీద కనిపించిన వెంటనే జై శ్రీ రామ్ అంటూ థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు అరిచినా వీడియోలను మనం యూట్యూబ్ లో ఎన్నో చూడవచ్చు.

    Ram Charan

    అంతలా రామ్ చరణ్ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు..రామరాజు గా ఆయన చూపించిన అద్భుతమైన నటనకి ఫిదా అయ్యి బాలీవుడ్ దర్శక నిర్మాతలు రాంచరణ్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు..లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే..ఆయన ఇటీవలే ఒక్క ప్రముఖ బాలీవుడ్ మూవీ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి మంతనాలు జరిపాడు అని..త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి ఒక్క సెన్సషనల్ ప్రకటన అధికారికంగా జరగబోతుంది అని వార్తలు వస్తున్నాయి..ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు..మన సౌత్ లో రాజమౌళి ఎలా అపజయం ఎరుగని డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడో..బాలీవుడ్ లో కూడా ఒక్క ఫ్లాప్ లేకుండా రాజ్ కుమార్ హిరానీ అనే దర్శకుడు ఉన్నాడు..ఈయన తెరకెక్కించిన 3 ఇడియట్స్ , pk , సంజూ, మున్నా భాయ్ MBBS మరియు లగేరహో మున్నాభాయ్ వంటి సినిమాలు బాలీవుడ్ లో ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పుడు ఈయనతోనే రామ్ చరణ్ త్వరలో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    Rajkumar Hirani

    Also Read: Kajal Aggarwal: దాన్ని అనుభవించి తీరాలంతే.. ఎమోషనలైన హీరోయిన్ !

    #RRR సినిమా షూటింగ్ పూర్తి అయినా తర్వాత పలుమార్లు ముంబై కి వెళ్లి రాజ్ కుమార్ హిరానీ తో కథాచర్చలు జరిపాడు అని..ఇప్పటికే ఒక్క కథ లాక్ అయ్యింది అని..త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అని బాలీవుడ్ లో సాగుతున్న చర్చ..ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ గారితో ఒక్క సినిమా చేస్తున్నాడు..ఇటీవలే అమ్రిత్సర్ లో ఒక్క షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకోచేందుకు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు..ఇది దిల్ రాజు గురువుకి నిర్మాతగా 50 వ సినిమా కావడం తో, ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అట..ఈ సినిమా తర్వాత జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత రామ్ చరణ్ మరియు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది..త్వరలో రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ తో ‘దుంకి’ అనే సినిమా చెయ్యబోతున్నాడు..ఇది పూర్తి అయినా తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు అని వినిపిస్తున్న వార్త.

    Also Read: Kodali Nani: కొడాలి నాని సైలెంట్.. గుడివాడకే పరిమితమైన వైసీపీ ఫైర్ బ్రాండ్

    Recommended Videos:

    Tags