https://oktelugu.com/

Elimination: ఒక్కరోజులోనే మారిన సీన్.. ఎలిమేషన్ కు చేరువలో బ్యూటీ..!

Bigg Boss OTT Elimination: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ సీజన్ గత ఐదు సీజన్లకు భిన్నంగా కొనసాగుతోంది. ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ గా అభిమానులను అలరిస్తున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమం ప్రస్తుతం ఎనిమిదవ వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఏడుగురు ఎమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళుతారనే ఉత్కంఠ నెలకొంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 12:52 PM IST
    Follow us on

    Bigg Boss OTT Elimination: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ సీజన్ గత ఐదు సీజన్లకు భిన్నంగా కొనసాగుతోంది. ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ గా అభిమానులను అలరిస్తున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమం ప్రస్తుతం ఎనిమిదవ వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఏడుగురు ఎమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళుతారనే ఉత్కంఠ నెలకొంది.

    Bigg Boss OTT Elimination

    ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చాలా బోల్డ్ కంటెంట్ తో కొనసాగుతోంది. అందమైన భామలు హౌస్ లో ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సినంత ‘మసాలా’ దొరుకుతోంది. దీంతో ఈ సీజన్ కు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా రెస్పాన్ష్ వస్తోంది. మరోవైపు యథావిధిగా ప్రతీవారం ఒకరు ఎలిమినేట్ అవుతుండటంతో గేమ్ ఆసక్తికరంగా మారుతోంది.

    Also Read: Hero Yash: య‌ష్ తో మూవీ చేసేందుకు క్యూ క‌డుతున్న ఇండియ‌న్ డైరెక్టర్లు.. ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్‌..?

    ఈ సీజన్లో మొత్తం 17మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వీరిలో ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా ఉన్నారు. ఇక ఎనిమిది వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

    గతంలో మాదిరిగానే ఈ వారం ఎన్నో గొడవలతో సాగింది. అయితే బాబా భాస్కర్ ఎంట్రీతో బిందు మాధవి సేఫ్ అయింది. దీంతో ఐదుగురు మాత్రమే నామినేట్ అయ్యారు. వీరిలో అఖిల్ సార్థక్, అజయ్ కుమార్, అషు రెడ్డి, హమీదా అనిల్ రాథోడ్‌లు నామినేషన్లో ఉన్నారు. దీంతో ఈసారి ఓటింగ్ ప్రక్రియ విభిన్నంగా సాగుతోందని తెలుస్తోంది.

    నామినేషన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వారేవరు లేరు. దీంతో వారి అభిమానులంతా హౌస్ లో ఎవరితో క్లోజ్ ఉన్నారో వారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కొందరు శృతిమించి ఆడటం ఓటింగ్ పై ప్రభావం చూపుతోంది. ఇందులో మంచిగా ఆడిన వారి ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది.

    ఎనిమిదో వారంలో ఓటింగ్ టైటిల్ ఫేవరెట్ గా బిందు మాధవి, యాంకర్ శివ ఉన్నారు. నామినేషన్లో వీరు లేకపోవడంతో వారి ఫ్యాన్స్ ఓట్లన్నీ అనిల్ రాథోడ్‌కు మళ్లిస్తున్నారు. దీంతో అతడే ఈ వారం టాప్‌లో ఉండబోతున్నాడని టాక్ విన్పిస్తోంది. అయితే ఈ టాస్కులో అఖిల్ సార్థక్ బాగా ఆడటంతో మొదటి స్థానానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: NTR Krishna Secrets : హీరో కృష్ణ గారి సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కి ఎన్టీఆర్ పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా ?

    అఖిల్ సార్థక్, అనిల్ రాథోడ్ లు మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా అషు రెడ్డి మూడు, హమీదా ఖటూన్ నాలుగు, ఐదో స్థానంలో అజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది.

    Recommended Videos: