Bobby : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏదైనా కూడా వాళ్ళని స్టార్లను చేయడంలో దర్శకులు చాలావరకు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. అయినప్పటికి దర్శకులను ఎక్కువగా పట్టించుకోరు. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు బాహుబలి లాంటి సినిమాలు చేయడం వల్లే తెలుగు సినిమా స్థాయి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిందనే ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటే మాత్రం తెలుగు ప్రేక్షకులనే కాదు ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు కూడా దర్శకులకు చాలా వాల్యూ ఇస్తారు…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీనియర్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్ గా ‘డాకు మహారాజు’ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన డైరెక్టర్ బాబీ (Babi)…ప్రస్తుతం బాబీ సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన చేసే సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటాయి. కాబట్టి సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే బాబీ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు అంటూ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక ఆ సినిమా అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ‘పుష్ప 3’ (Pushpa 3) సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇలా మూడు సినిమాలకి ముందుగానే ముహూర్తం పెట్టుకున్నాడు అంటే దాదాపు ఒక నాలుగు సంవత్సరాల పాటు అల్లు అర్జున్ డైరీ మొత్తం ఫుల్ అయిపోయింది…
ఇక మిగతా హీరోలందరు కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం వల్ల మరోసారి ఆయన మరో సీనియర్ హీరోతోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి స్టార్ హీరోలు బాబీ కి అవకాశం ఇవ్వకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే బాబీ రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ ఉంటాడు.
తద్వారా ఇంతకుముందు చూసిన సినిమాలనే మళ్లీ చూస్తున్నామా అనే ఒక ఫీల్ అయితే ఆయన సినిమాలను చూస్తున్న ప్రతిసారి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అతనికి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. ఇక సీనియర్ హీరోలతో అయితే ఆల్రెడీ చూసిన కథని తిప్పితిప్పి చేసినా కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి. అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే కొంతవరకు ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్ జోన్ లో ఉండొచ్చనే ఉద్దేశ్యం తోనే బాబీ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు…మరి ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో నాగార్జున ఒక్కడే కొంతవరకు ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బాబీ ఆయనతో సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…