‘బింబిసారా’ ఫస్ట్ లుక్: చారిత్రక పాత్రలో కళ్యాణ్ రామ్

తాత సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మనవడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ తన 18వ చిత్రం పేరు ‘బింబిసారా’గా ప్రకటించారు. టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. మొదటి పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కత్తిని పట్టుకొని, కళ్యాణ్ రామ్ ఎప్పుడూ చూడని శక్తివంతమైన గెటప్‌ను కలిగి ఉన్నాడు. యుద్ధంలో ఓడించి చంపిన సైనికులపై కూర్చుని, గంభీరంగా చూస్తున్న కళ్యాణ్ రామ్ […]

Written By: NARESH, Updated On : May 28, 2021 12:29 pm
Follow us on

తాత సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మనవడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ తన 18వ చిత్రం పేరు ‘బింబిసారా’గా ప్రకటించారు.

టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. మొదటి పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కత్తిని పట్టుకొని, కళ్యాణ్ రామ్ ఎప్పుడూ చూడని శక్తివంతమైన గెటప్‌ను కలిగి ఉన్నాడు. యుద్ధంలో ఓడించి చంపిన సైనికులపై కూర్చుని, గంభీరంగా చూస్తున్న కళ్యాణ్ రామ్ లుక్ అసాధారణంగా ఉంది.

సోషల్ ఫాంటసీ కథాంశంతో ఈ స్టోరీని తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది టైమ్ ట్రావెల్ మూవీ అని.. అధిక విఎఫ్ఎక్స్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇలా చారిత్రక పాత్రలో కల్యాణ్ రామ్ మొదటి నటిస్తున్నాడు. ‘బింబిసారా’ తో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..

ఈ పెద్ద బడ్జెట్ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. రాసా , కేథరీన్ ట్రెసా మరియు సమ్యక్త మీనన్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. హరి కృష్ణ కె సమర్పణలో ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.