
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులో ఇవాళ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు కీలక అరెస్టు చేశారు. హైదరాబాద్ లో సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ మృతి విషయంలో డ్రగ్స్ కోణంలో ఎన్సీబీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ 14వ తేదీన అనుమానాస్పద రీతిలో బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎస్సీబీ అరెస్టు చేసి రిలీజ్ చేసింది. హీరో సుశాంత్ కు సిద్ధార్థ్ పితాని ఫ్రెండ్. ఇద్దరు కలిసి ఒకే ప్లాట్ లో ఉండేవారు. సిద్ధార్థ్ ను విచారణ కోసం ముంబైకి తీసుకు వెళ్లనున్నారు.