Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లోకి సర్ప్రైజ్ ఎంట్రీలు… ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మేకర్స్ పక్కా స్కెచ్!

బిగ్ బాస్ తెలుగు 8కి రంగం సిద్ధం అవుతుంది. ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు మేకర్స్ గొప్ప ప్రణాళికలు వేస్తున్నారు. సీజన్ సక్సెస్ హౌస్లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే వారి ఎంపిక ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అనేక సర్ప్రైజ్ ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.

Written By: S Reddy, Updated On : August 2, 2024 9:43 am

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించేందుకు బిగ్ బాస్ సరికొత్త సీజన్ సిద్దమవుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, సెట్ వర్క్ వంటి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారట. ఈసారి హౌస్ లోకి పంపించబోయే కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్. గత సీజన్ 7 హైయెస్ట్ టీఆర్పీ సాధించి, దేశంలోనే నెంబర్ వన్ షో గా నిలిచింది.

అయితే బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అతి తక్కువ గణాంకాలను నమోదు చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ సైతం పరమ బోరింగ్ అనిపించుకున్నారు. అందుకే సీజన్ 7 పై ప్రత్యేక శ్రద్ధ వహించి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అడుగడునా సర్ప్రైజ్ ఇస్తూ సీజన్ సూపర్ హిట్ చేశారు. రెండు లాంచ్ ఈవెంట్స్ నిర్వహించడం .. మరో ఐదుగురిని వైల్డ్ ద్వారా హౌస్ లోకి పంపించడం షో లో హైలెట్ గా నిలిచింది.

ఇదే విధంగా సీజన్ 8 లో కూడా చాలానే సర్ప్రైజ్ ప్యాకేజీలు ఉంటాయట. గత సీజన్ మాదిరిగా లాంచ్ ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని లోపలి పంపించి .. మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరి కొందరిని పంపించే అవకాశం ఉందట. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ 8 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ పరిశీలిస్తే .. యాంకర్ రీతూ చౌదరి, ఖయ్యూం అలీ, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు, ఆర్టిస్ట్ అక్షిత, నిఖిల్, అమృత ప్రణయ్.

యాదమరాజు , మై విలేజ్ షో అనిల్, కుమారి ఆంటీ, బుల్లెట్ భాస్కర్, వంశీ, సోనియా సింగ్, కుషిత కల్లాపు, సుప్రీత, అంజలి పవన్, యాంకర్ వింధ్య విశాఖ, విష్ణు ప్రియ వంటి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హీరో అబ్బాస్, నటుడు రోహిత్, ప్రభాస్ శ్రీను, వేణు స్వామి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరి వరకు వీరు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అని చెప్పలేము. లాంచింగ్ ఎపిసోడ్ చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది రహస్యంగా ఉండాలి.

ఎందుకంటే బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన వారిలో హౌస్ లోకి వెళ్లే వరకు ఏ ఒక్క కంటెస్టెంట్ ఫిక్స్డ్ కాదు. ఇటీవల విడుదల అయిన బిగ్ బాస్ సీజన్ 8 లోగో మరింత ఆసక్తి పెంచుతుంది. ఎప్పుడెప్పుడు సీజన్ 8 స్టార్ట్ చేస్తారా అని బీబీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉండబోతున్నాయట. ఒకటి మెయిన్ హౌస్ కాగా మరొకటి లూప్ హౌస్ అట. ఇరు ఇళ్లల్లోని సభ్యుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందట. మరి చూడాలి బిగ్ బాస్ ఆడియన్స్ కోసం మేకర్స్ ఎలాంటి సప్రైజ్ లు ప్లాన్ చేశారో..