Vastu Tips : తులసి మొక్క వాడిపోతే పడేయవద్దు.. మరేం చేయాలి? పడేస్తే ఏం జరుగుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉందని అర్థం. తులసి మొక్కకు క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం తులసి మొక్కకు పూజలు చేస్తూ తులసి దళాలు తెంపకుండా ఉండాలి. అలాగే రాత్రి సమయంలో తులసి దళాలు తుంచవద్దు.

Written By: Srinivas, Updated On : August 2, 2024 9:40 am
Follow us on

Vastu Tips : హిందూ నియమాల ప్రకారం ప్రతీ వస్తువులో ఒక దేవుడు ఉంటారని అంటారు. అలాగే ప్రతీ చెట్టు ఒక ఒక దేవతకు ప్రతిరూపం అంటారు. మనకు అందుబాటులో ఉన్న అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి ఒకటి. తులసి చెట్టు దాదాపు ప్రతీ హిందువు ఇంట్లో ఉంటుంది. ఈ చెట్టుకు ప్రతిరోజూ పూజ చేసేవాళ్లు ఉన్నారు. శుక్రవారం అయితే భక్తి శ్రద్దలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కొందరు హిందూ శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల తులసి మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తులసి దళాలు ఎంతో పవిత్రమైనవి.. అంతేకాకుండా ఇవి ఆరోగ్యకరమైనవి. దగ్గు, జలుబు వచ్చినప్పడు తులసి దళాల రసం తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అందువల్ల పూర్వీకులు ఎక్కువగా తులసి దళాలతోనే వైద్యం చేసకునేవారు. తులసి మొక్కను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ మొక్కను మిగతా చెట్ల వద్ద కాకుండా ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచాలి. ఈ మొక్కను అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంటికే అరిష్టం అని అంటారు. ప్రతీ మొక్కకు కొంత కాల పరిమితి ఉంటుంది. అలాగే తులసి మొక్క కూడా కొన్నాళ్ల తరువాత ఎండిపోతుంది. అయితే మిగతా మొక్కల వలె తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు. మరి ఎండిన తులసి మొక్కను ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉందని అర్థం. తులసి మొక్కకు క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం తులసి మొక్కకు పూజలు చేస్తూ తులసి దళాలు తెంపకుండా ఉండాలి. అలాగే రాత్రి సమయంలో తులసి దళాలు తుంచవద్దు.

తులసి మొక్క కొన్ని రోజుల పాటు పచ్చగా ఉండి.. ఆ తరువాత ఎండిపోతుంది. ఎండిన తులసిని తప్పకుండా తీసివేయాలి. ఎండిపోయిన తులసి ఇంట్లో ఉండడం వల్ల కష్టాలు ఎదుర్కొంటారు. అయితే మిగతా మొక్కల మాదిరిగా తులసిని అపరిశుభ్రమైన ప్రదేశాల్లో పడేయవద్దు. చెత్త బుట్టలో వేయొద్దు. ఎండిన తులసిని అస్సలు మంటల్లో వేయొద్దు. ఈ మొక్కను పవిత్రంగా భావించి భూమిలో పాతి పెట్టాలి. లేదా ఎండిన తులసి దళాలు పూర్తిగా తొలగించి మొక్కను భూమిలో పాతి పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొత్త తులసి ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. లేకుంటే కష్టాలు ఏర్పడుతాయి.

తులసి మొక్క మంచి ఆయుర్వేదంగా భావిస్తారు. తులసి దళాల రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే రాత్రి సమయంలో, శుక్రవారం రోజు తులసి దళాలు తుంచకుండా ఉండాలి. ఈరోజు వీలైతే ప్రత్యేక పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు తులసి మొక్కకు ప్రతీ రోజూ స్నానం చేసిన తరువాత నీళ్లు పోయాలి. పొరపాటున తులసి మొక్కకు కాలు తగిలితే పవిత్రంగా భావించి మొక్కాలి.

ఇక తులసి మొక్కకు పూజ సమయంలో పంచదారను ఉంచాలి. లేదా ఏదైనా తీపి పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్స్మీదేవి సంతోషంగా ఉంటుందని హిందూ శాస్త్రం తెలుపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని తులసి మొక్క వద్ద ఉంచాలి.