Bigg Boss Telugu 8: గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసి, అతని చేతిలో కప్ పెట్టి పంపించారు. ఈ సీజన్ లో అదే తరహా ట్రీట్మెంట్ మణికంఠ మీద కూడా జరుగుతున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. మణికంఠ ఎలాంటి గేమ్స్ ఆడెలకపోయినా కూడా అతన్ని టార్గెట్ చేసి హౌస్ మేట్స్ అనవసరం గా పెద్దవాడిని చేసేస్తున్నారు. మణికంఠ వేసిన ట్రాప్ లో చాలా తేలికగా పడిపోతున్నారు. ముందుగా మణికంఠ వేసిన మాస్టర్ ప్లాన్ అందరితో స్నేహం గా ఉన్నట్టు నటిస్తూ, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, ఆ తర్వాత ఆ గొడవల్లో వచ్చే అంశాలను నామినేషన్స్ వేయడం, అన్ని రోజులు స్నేహంగా ఉన్నవారిని శత్రువులను చేసుకోవడం. విష్ణు ప్రియా విషయం లో, అలాగే యష్మీ విషయంలో కూడా అదే అదే జరిగింది. ఇక ఈ వారం ఆయన నబీల్ తో గొడవలు పెట్టుకున్నాడు.
కచ్చితంగా వచ్చే వారం నామినేషన్స్ లో మణికంఠ నబీల్ ని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇలా హౌస్ లో ఇతనితో మంచిగా మాట్లాడే వాళ్ళను కూడా శత్రువులు చేసుకున్న ప్రభావం నిన్నటి టాస్కు మీద పడింది. మణికంఠ పేరుతో ఉన్న కుక్క బొమ్మని తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ముందుగా సీత దగ్గరకు వెళ్లి నా బొమ్మని తీసుకుంటావా అని అడుగుతాడు మణికంఠ, నేను తీసుకోలేను, విష్ణు, నైనిక, నేను కలిసి ఆడాలని అనుకుంటున్నాను అని సీత అంటుంది. అయితే మణికంఠ ఆదిత్య ని అడగలేదు, నిఖిల్ మరియు నబీల్ తో కూడా మాట్లాడలేదు. వాళ్ళతో మాట్లాడి ఉండుంటే మణికంఠ బొమ్మని కూడా తీసుకునేవారేమో, కానీ అది జరగలేదు. మణికంఠ బొమ్మ యష్మీ చేతికి దొరుకుతుంది. యష్మీ కావాలని టార్గెట్ చేసి మణికంఠ బొమ్మని పట్టుకొని డేంజర్ జోన్ లోకి వెళ్లి నిలబడుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరిని తియ్యాలి అనే నిర్ణయం సంచాలక్ గా పృథ్వీ చేతికి వస్తుంది. పృథ్వీ యష్మీ ని చీఫ్ కంటెండర్ రేస్ లో పెట్టి మణికంఠ ని తొలగిస్తాడు. అలా ఈ టాస్కు సాగుతూ ఉండేలోపు మణికంఠ కి తనని ఎవ్వరూ పట్టించుకోలేదని బాధ వేస్తుంది. తనని హౌస్ మొత్తం కార్నెర్ చేసినట్టు ఫీల్ అవుతాడు. ఈ విషయం లో సీత అలా జనాలకు చెప్పకు, చాలా తప్పు అంటూ పెద్దగా గొడవలు వేసుకుంటుంది.
మీరు నా బొమ్మని పట్టుకోడానికి ఇష్టపడలేదు, వాళ్ళు నా బొమ్మని పట్టుకోడానికి ఇష్టపడలేదు, ఇలా రెండు వైపులా నన్ను రిజెక్ట్ చేస్తే మధ్యలో ఉన్న నాకు కచ్చితంగా మీరంతా కార్నెర్ చేసినట్టే అనిపిస్తుంది కదా అని మణికంఠ బాధపడుతాడు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండగా యష్మీ వచ్చి ఓదారుస్తుంది. అతనికి ధైర్యం చెప్తుంది, బయట నాకు పెద్దగా ఫాలోయింగ్ లేదు, వరుసగా నాలుగు వారాలు నామినేషన్స్ లో ఉన్నాను, వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, నేను ఎలిమినేట్ అవుతానేమో అని భయం వేస్తుంది అంటూ యష్మీ తో చెప్పుకొని ఏడుస్తాడు మణికంఠ. అలా అనుకోకు, అభయ్ నీకంటే టాస్కులు బాగా ఆడుతాడు, అతను నామినేషన్స్ లోకి రాగానే ఎలిమినేట్ అవుతాడని నువ్వు ఊహించావా?, అయ్యాడు కదా?, కాబట్టి నువ్వు లేనిపోనివి మనసులో పెట్టుకొని బాధపడకు అని యష్మీ ఓదారుస్తుంది.