Bigg Boss Telugu 8: ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం లో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మన అందరికీ బాగా స్ట్రాంగ్ గా అనిపించినా కంటెస్టెంట్స్ లో ఒకరు నైనిక. ఈమె మొదటి రెండు వారాలు చాలా బాగా ఆడింది. మొదటి వారం లో పెట్టిన చీఫ్ టాస్కు లో నిఖిల్ తో సమానంగా ఆడి, టాస్కు గెలిచి చీఫ్ గా నిల్చింది. దీంతో నైనిక గ్రాఫ్ ఊహించని రేంజ్ లో పెరిగింది. మొదటి టాస్కు లో అంత వేగంగా, ఫోకస్ గా ఎలా ఆడగలిగావు అని ఆమెని నాగార్జున అడగగా, నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం సార్, అందుకే అలా ఆడాను అని చెప్తుంది. ఈ మాట ఆమె చెప్పగానే ప్రేక్షకులు ‘అబ్బో..మామూలు కంటెస్టెంట్ దొరకలేదు గా, టాప్ 5 లో కచ్చితంగా ఉంటుందేమో’ అని అందరూ అనుకున్నారు.
కానీ మరుసటి రెండు వారాల్లో నైనిక ఆట బాగా తగ్గిపోయింది. టాస్కులు ఆడే అవకాశాలు ఆమెకి రాలేదు, దానితో పాటుగా ఆమె కంటెంట్ కూడా సరిగా ఇవ్వలేకపోయింది. దీంతో నైనిక గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా టాప్ 3 లో ఒకరుగా ఉండే నైనిక, ఇప్పుడు అందరికంటే తక్కువ ఓట్లతో చివరి స్థానంలోకి రావడం, ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఒక మంచి కంటెస్టెంట్ ని సరిగా ఉపయోగించుకోలేదు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈరోజు జరిగే రీ లోడ్ ఎపిసోడ్ లో నైనిక ఎలిమినేట్ అవ్వబోతుంది. శనివారం ఎపిసోడ్ లో కేవలం నిఖిల్, నబీల్ మాత్రమే ఆడియన్స్ నుండి సేవ్ అయ్యారు. నేటి ఎపిసోడ్ ని కూడా నిన్ననే షూట్ చేసారు. నైనిక ఎలిమినేషన్, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీలు, నామినేషన్స్, టాస్కులు అన్ని జరిగిపోయాయి. నైనిక తో బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ ని కూడా పూర్తి చేసారు.
అయితే ఈ సీజన్ లో 5 వారాలు కొనసాగినందుకు నైనిక కి రెమ్యూనరేషన్ భారీ మొత్తం లోనే ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమెకు వారానికి 3 లక్షల రూపాయిలు ఇచ్చారట. ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ లో ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ కేవలం నైనిక మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే ముందు ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాన్స్ షో ‘ఢీ’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనింది. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి అవకాశాలు రాలేదు కానీ, బిగ్ బాస్ ద్వారా మాత్రం ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ షో నుండి బయటకి వెళ్లిపోయిన తర్వాత ఆమెకు కచ్చితంగా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఇప్పటి నుండి ఈమె కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.