Bigg Boss Telugu 8: మణికంఠ ఒక ‘దుర్మార్గుడు’ అని నాగార్జున ముందు తేల్చేసిన హౌస్ మేట్స్..ఇంత చెప్పినా మారకపోతే దేవుడు కూడా కాపాడలేడు!

మణికంఠ పరిస్థితి కూడా అదే. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మణికంఠ టాప్ 3 లో ఉన్నాడు అనే విషయం హౌస్ మేట్స్ అందరికీ తెలిసింది. ఇతనికి ఇంత ఓటింగ్ ఎలా వచ్చింది?, మనల్ని విలన్స్ ని చేసి వాడు కావాల్సినంత అటెన్షన్ తెచ్చుకుంటున్నాడు, సందర్భం లేకపోయినా గొడవలు పెట్టుకొని, శత్రువులను చేసి జనాలకు చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఏడ్చి సానుభూతి పొందుతున్నాడు అనేది అందరికీ అర్థం అయిపోయింది.

Written By: Vicky, Updated On : October 6, 2024 9:30 am

Bigg Boss Telugu 8(86)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న మొన్నటి వరకు ఈ సీజన్ బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే విషయం లో ప్రేక్షకులకు పెద్దగా క్లారిటీ ఉండేది కాదు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ తో టైటిల్ విన్నర్ మణికంఠ నే అని తేలిపోయింది. హౌస్ మేట్స్ అతన్ని టార్గెట్ చేసిన తీరుని చూస్తే, అతన్ని ద్వేషించే వాళ్లకు కూడా అయ్యో పాపం అని అనిపించక తప్పదు. ప్రతీ ఒక్కరు మణికంఠ కి స్వార్థపరుడు, కన్నింగ్ నేచర్ ఉన్నోడు, టాక్సిక్ మెంటాలిటీ, చూడగానే చిరాకు కలిగించే చేష్టలు చేసేవాడు ఇలా ఒక్కటా రెండా ఎన్నో దారుణమైన ట్యాగ్స్ అతనికి ఇచ్చేసారు. స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా మణికంఠ కి అలాంటి ట్యాగ్స్ ఇచ్చేలోపు, అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. గొంతు నుండి పాపం మాట పెగలలేదు. ఇక్కడ మాత్రం మణికంఠ రోజు చేసే డ్రామా మాత్రం చేయలేదు, ఒక మనిషిని హౌస్ మొత్తం ఇంత ద్వేషపూరితమైన అభిప్రాయాలను చెప్తే ఎవరికైనా ఆ స్థానం లో ఉన్నప్పుడు అలాంటి బాధనే కలుగుతుంది.

మణికంఠ పరిస్థితి కూడా అదే. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మణికంఠ టాప్ 3 లో ఉన్నాడు అనే విషయం హౌస్ మేట్స్ అందరికీ తెలిసింది. ఇతనికి ఇంత ఓటింగ్ ఎలా వచ్చింది?, మనల్ని విలన్స్ ని చేసి వాడు కావాల్సినంత అటెన్షన్ తెచ్చుకుంటున్నాడు, సందర్భం లేకపోయినా గొడవలు పెట్టుకొని, శత్రువులను చేసి జనాలకు చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఏడ్చి సానుభూతి పొందుతున్నాడు అనేది అందరికీ అర్థం అయిపోయింది. వాస్తవానికి మణికంఠ గేమ్ ప్లాన్ అదే. అలాంటప్పుడు హౌస్ మేట్స్ అంత ఏమి చెయ్యాలి?, మణికంఠ ని పట్టించుకోకుండా, టార్గెట్ చేయడం పూర్తిగా మానేయాలి. అప్పుడు అతనికి కంటెంట్ రాదు, సాధారణంగానే ఓటింగ్ గ్రాఫ్ అమాంతం తగ్గిపోతాది. కానీ అది చేయడం లేదు, మణికంఠ నిజస్వరూపాన్ని జనాలకు తెలియచేసే ప్లాన్ వేశారు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది, ఈ వారం మణికంఠ నామినేషన్స్ లోకి వస్తే టాప్ 1 లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ క్రెడిట్ మాత్రం హౌస్ మేట్స్ కి ఇవ్వాలి.

ఇదంతా పక్కన పెడితే గత సీజన్ లో కంటెస్టెంట్స్ కూడా ఇలాగే పల్లవి ప్రశాంత్ సింపతీ గేమ్స్ ఆడుతున్నాడు, అతనేంటో జనాలకు తెలిసేలా చేయాలి అనే ఉద్దేశ్యంతో అమర్ దీప్ మరియు అతని గ్యాంగ్ మొత్తం నామినేషన్స్ వేశారు. ఆ ఒక్క ఎపిసోడ్ పల్లవి ప్రశాంత్ జాతకాన్ని మార్చేసింది. నిన్నటి ఎపిసోడ్ మణికంఠ కి అలాటిందే అని చెప్పాలి. హౌస్ మేట్స్ సంగతి కాసేపు పక్కన పెడితే, నాగార్జున కూడా మణికంఠ ని టార్గెట్ చేయడం గమనార్హం. ఎపిసోడ్ ప్రారంభం లోనే మణికంఠ ని యాక్షన్ రూమ్ లోకి పిలిచి, 8 నిముషాలు ఇస్తున్నాను, ఎంత ఏడవాలి అనుకుంటున్నావో అంత ఏడ్చేయ్ అని అంటాడు నాగార్జున. ఇలా సీతకి, యష్మీ కి ఎందుకు చేయలేదు, వాళ్ళు కూడా ప్రతీ చిన్నదానికి ఏడుస్తూనే ఉంటారు కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. కనీసం హౌస్ మేట్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మణికంఠ ని టార్గెట్ చేయకుండా ఉండడం బెటర్, లేకుంటే ఈ సీజన్ లో ఒక అనర్హుడికి టైటిల్ వచ్చే అవకాశం ఉంటుంది.