RCB : ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్లలో బెంగళూరు ఒకటి. ముంబై, చెన్నై తర్వాత ఆ స్థాయిలో బ్రాండ్ వాల్యూ ఉన్నది బెంగళూరు జట్టుకే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా బెంగళూరు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ సాధించకపోయినప్పటికీ.. ఆ జట్టుపై అభిమానులకు ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవలి ఐపిఎల్ లో బెంగళూరు జట్టు చివరి 8 మ్యాచ్లను గెలిచి సెమీస్ దాకా వెళ్ళింది. సెమీస్ లో ఓటమి పాలయినప్పటికీ అభిమానుల మనసులు గెలుచుకుంది. మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ బెంగళూరు జట్టు కప్ సాధించలేకపోయింది. ఫైనల్ వెళ్లడం.. ఒత్తిడి భరించలేక ఓడిపోవడం బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారింది. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో ఐపీఎల్ ఛాంపియన్ అనే ట్యాగ్ లైన్ ను బెంగళూరు జట్టు యాడ్ చేసుకుంది. అయితే కీలక దశలో ఆటగాళ్లు చేతులెత్తేయడంతో బెంగళూరు ట్రోఫీ దక్కించుకోలేకపోయింది. అయితే బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించకపోయినప్పటికీ బెంగళూరు నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించింది. సేవా విభాగంలో బెంగళూరు జట్టు అతిపెద్ద సాహసాన్ని చేసింది…
నీటి కరువుతో అల్లాడిపోతున్న బెంగళూరులో..
బెంగళూరు నగరంలో ప్రస్తుతం నీటి కరువు తారాస్థాయికి చేరింది. ఇటీవల నీటి కరువు వల్ల బెంగళూరు నగరం వార్తల్లోకి ఎక్కింది. అయితే నైరుతి రుతుపవనాల వల్ల కాస్త వర్షాలు కురవడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ నీటి కరువు ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు బెంగళూరు నగరంలోని పలు చెరువులకు జీవం పోసింది. ఏకంగా జలకలను తీసుకొచ్చింది. చెరువుల పునరుద్ధరణకు తన వంతు నడుం బిగించింది. ఇప్పటివరకు బెంగళూరు యాజమాన్యం రెండు చెరువుల చిత్రాన్ని సమూలంగా మార్చింది. ఐపీఎల్ లో విజేతగా నిల్వక పోయినప్పటికీ.. కన్నడ అభిమానులు ప్రతిసారి బెంగళూరు జట్టుకు జేజేలు పలుకుతుంటారు.. అభిమానులు విపరీతమైన ఆదరణ చూపుతున్న నేపథ్యంలో.. వారికి ఏదైనా చేయాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించుకుంది. 2011 నుంచి ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఈ క్రమంలో ఇండియా కేర్ అనే సంస్థతో చేతులు కలిపి చెరువులను పునరుద్ధరించింది. చెరువుల పరిరక్షణలో ఆ సంస్థకు తన వంతు సాయం చేసింది.. బెంగళూరు నగరంలోని ఇట్లగల్పుర, సడన్ హల్లి అనే చెరువులను బెంగళూరు జట్టు యాజమాన్యం బాగు చేసింది. ఆ తర్వాత నీళ్లను నింపి.. ఆ చెరువులను స్థానికులకు అప్పగించింది. కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా సమాజ హితమైన కార్యక్రమాలు చేపట్టి బెంగళూరు జట్టు అభిమానుల మనసును గెలుచుకుంది. ఈ క్రమంలో అభిమానులు బెంగళూరు జట్టు యాజమాన్యం సేవా నిరతిని పొగుడుతున్నారు. బెంగళూరు దయా గుణం ముందు ఏ జట్లూ సరి రావని కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు నగరం కోసం బెంగళూరు జట్టు యాజమాన్యం భగీరథ ప్రయత్నం చేసిందని సామాజిక మాధ్యమాల వేదికగా కొనియాడుతున్నారు నెటిజన్లు.
Ever since RCB’s Go Green Initiative began in 2011, we have stayed committed to making Planet Earth a healthier place for future generations!
In 2024, RCB in partnership with India Cares Foundation and Friends of Lakes embarked on Lake restoration of Ittgalpura and… pic.twitter.com/SRamFoyV9E
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 5, 2024