https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సోనియా కి చుక్కలు చూపించిన నభీల్.. ఈరోజు నామినేషన్స్ మామూలుగా ఉండదు!

నబీల్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె గొంతు పెంచగానే, ఆమెకి డబుల్ గా గొంతుని పెంచి ఆమె నోరు మూయిస్తాడు. గత వారం నబీల్ సంచాలక్ గా వ్యవహరించినప్పుడు సోనియా అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై గొంతు పెంచుతూ చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇది నబీల్ కి అప్పుడు నచ్చలేదు. ఈ పాయింట్ మీద ఆయన వివరణ ఇస్తూ ఆమెని నామినేట్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 09:35 AM IST

    Bigg Boss Telugu 8(35)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మూడు వారాలు దిగ్విజయం గా పూర్తి చేసుకొని నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అభయ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన ఎలిమినేషన్ కి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా బాధపడ్డారు కానీ, ప్రేక్షకులు మాత్రం చాలా సంతోషించారు. అయితే ఈ వారం జరిగే నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో నిన్నటి ఎపిసోడ్ చివర్లో టెలికాస్ట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ ప్రోమో లో నామినేషన్స్ జరిగింది చూపించారు. ఈ నామినేషన్స్ లో సోనియా, నబీల్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగినట్టుగా అనిపించింది. ఎవరైనా మాట్లాడుతుంటే క్రాస్ టాక్ చేసి వాళ్ళను తికమక పెట్టడం సోనియా లో ఉన్న క్వాలిటీ.

    కానీ నబీల్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె గొంతు పెంచగానే, ఆమెకి డబుల్ గా గొంతుని పెంచి ఆమె నోరు మూయిస్తాడు. గత వారం నబీల్ సంచాలక్ గా వ్యవహరించినప్పుడు సోనియా అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై గొంతు పెంచుతూ చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇది నబీల్ కి అప్పుడు నచ్చలేదు. ఈ పాయింట్ మీద ఆయన వివరణ ఇస్తూ ఆమెని నామినేట్ చేసాడు. ఈ సమయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సోనియా కూడా నబీల్ ని నామినేట్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే సోనియా పై ఈ వారం నామినేషన్స్ చాలా బలంగా పడ్డాయి. కేవలం ఒక్క ప్రోమోలోనే ఆమెని ఆదిత్య, నబీల్ నామినేట్ చేసింది చూపించారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ఆమెని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈమెకు సోషల్ మీడియా లో ఉన్న నెగటివిటీ మామూలుది కాదు. అంతే కాకుండా ఈమె వల్ల నిఖిల్ గేమ్ పూర్తిగా చెడిపోతుంది చాలా మంది అభిప్రాయం. అందుకే నిఖిల్ ఫ్యాన్స్ ఈమెకి ఓటు వెయ్యకుండా హౌస్ నుండి బయటకి పంపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సోనియా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే నిఖిల్ ఎమోషనల్ చాలా స్ట్రాంగ్ అవుతాడు, టైటిల్ కచ్చితంగా కొడుతాడు అనేది ఆయన అభిమానుల ఆకాంక్ష.

    కానీ సోనియా కి పీఆర్ టీం బీభత్సంగా ఉంది, అంతే కాదు ఆమెని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు, బిగ్ బాస్ టీం కి కూడా సోనియా ఎంతో ప్రత్యేకం, ఎందుకంటే ఆమె కారణంగా బోలెడంత కంటెంట్ వస్తుంది. అందుకే సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ వారం నామినేషన్స్ లోకి సోనియా తో పాటు ఆదిత్య ఓం కూడా వస్తే, సోనియా నూటికి నూరు శాతం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ లోకి వస్తే ఆదిత్య ఓం కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అనేది సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న మాట.