Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వెనక ఎవరు ఉన్నారు… వాళ్ళకి ఎన్టీయార్ అంటే ఎందుకు నచ్చడం లేదు..

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో మార్కెట్ ఉంటుంది. వాళ్ళు ఆ మార్కెట్ ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తుంటారు. అలాగే సినిమా సినిమాకి మధ్య వైవిధ్యాన్ని చూపిస్తూ భారీ సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 23, 2024 9:38 am

Devara Pre Release Event(2)

Follow us on

Devara Pre Release Event: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఎలాంటి పాత్రలో అయిన నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ లో మంచి పట్టున్న హీరో ఈ జనరేషన్ లో మరెవరూ లేరు అనేది వాస్తవం… అందుకే ఆయనకు. ‘మాన్ ఆఫ్ ది మాసేస్’ అనే బిరుదును కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తున్న దేవర సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే నిన్న జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం పట్ల పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ఈవెంట్ రద్దవ్వడం అనేది కేవలం పోలీసుల వైఫల్యమని కొంతమంది భావిస్తుంటే, మరి కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయ్యడానికే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక ఎవ్వరికీ లేని అన్ని ఇబ్బందులు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఉంటాయి. దానికి కారణం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే నచ్చని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయిస్తున్నారా? లేదంటే నిజంగానే ఇలా ఇలా జరిగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ దేవర సినిమాకి జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. ఇక ఈ ఈవెంట్ అనేది జరిగితే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిలో కూడా భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకునేది. కానీ అలాంటిదేమీ జరగకుండా సింపుల్ గా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ పట్టించుకోకుండా తన సినిమా కంటెంట్ బావుంది అలాగే అవుట్ పుట్ కూడా అదిరిపోయే విధంగా వచ్చింది. కాబట్టి సినిమా సక్సెస్ అవుతుందని చాలా వరకు మంచి కాన్ఫిడెంట్ అయితే పెట్టుకున్నాడు.

ఇక తన అభిమానుల్లో కూడా పాజిటివిటి ని నింపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటానని ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఎన్టీయార్ అభిమానులు ఆయన సినిమాకి భారీ రేంజ్ లో కలెక్షన్లు రావడానికి వాళ్ళ సాయా శక్తుల కృషి చేస్తూ ఉంటారు…

ఇక ఇప్పుడు దేవర విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఈ సినిమా భారీ రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నట్టు పలువురు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…