https://oktelugu.com/

TANA : భారతీయ కళలకు ప్రాణం పోస్తున్న తానా కళాశాల.. చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్నారైల పిల్లలు.. పరీక్షలకు ఉత్సాహంగా హాజరు

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల ఆధిపత్యం.. అందులో తెలుగువారి ఆధిపత్యం క్రమంగా పెరుగుతోంది. విద్యా, ఉద్యోగం, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన వారు, వెళ్తున్నవారిలో చాలా మంది అక్కడే స్థిర పడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2024 9:29 am

    TANA College brings Indian arts to life for NRI children

    Follow us on

    TANA : అమెరికాలో వివిధ స్థిరపడిన తెలుగువారు, భారతీయులు మన సంస్కృతి సంప్రదాయాలను మాత్రం వచ్చిపోవడంలేదు. మన పండుగలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌ తరాలు కూడా కాపాడేందుకు కృషి చేస్తున్నారు. అమెరికాలో తెలుగువారి కోసం, తెలుగు పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఉత్తర మెరికా తెలుగు సంఘం(తానా) మన సంస్కృతిని కాపాడేందుకు విశేషంగా కృషి చేస్తోంది. ఏడాదంతా వివిధ కార్యక్రమాలతో తెలుగువారిని ఏకం చేస్తోంది. కొత్తగా అమెరికాకు వెళ్లేవారికి సహాయ సహకారాలుదిస్తోంది. వేసవిలో క్రీడా శిభిరాలు నిర్వహిస్తోంది. సాంస్కృతి, క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఇక భారతీయ కళలు, సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలను కాపాడేందుకు తానా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాలను కూడా నిర్వహిస్తోంది. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీం కోర్సులు నిర్వహిస్తోంది. తాజాగా ఆయా కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు శనివారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు వందలాది మంది భారతీయ అమెరికన్‌ విద్యార్థులు హాజరయ్యారు. టెక్సాస్, జార్జియా, నార్త్‌ కరోలినా, న్యూజెర్సీ, మిచిగాన్, మసాచుసెట్స్, ఒమహా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు.

    అమెరికా వ్యాప్తంగా ఆదరణ..
    తానా కళాశాలలో నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం కోర్సులకు అమెరికా వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి తానా వారు చేస్తున్న ఈ కృషికి విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అభినందించారు. ఇక భారతీయ కోర్సులు నేర్చుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులను తానా కలాశాల చైర్‌పర్సన్‌ మాతలి నాగభైరవ, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన మనసంప్రదాయ కళలను అమెరికాలో నేర్చుకుంటూ మన వారసత్వ సంపదను కాపాడుతున్న విద్యార్ధినులను అభినందించారు. అందుకు తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించేలా సహకించిన విద్యార్థులకు, శాస్త్రీల నృత్యం, కర్ణాటక సంగీంలో ఉత్తమ శిక్షణ ఇస్తున్న గురువులకు ధన్యావాతాలు తెలిపారు.

    పరీక్ష విధానంపై సంతృప్తి..
    ఈ ఏడాది పరీక్ష విధానంలో తీసుకువచ్చిన మార్పుపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని కళాశాల చైర్‌ పర్యసన్‌ మాలతి నాగభైరవ తెలిపారు. ఈ మార్పుకు కారణమైన కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపరు. వచ్చే విద్యా సంవత్సరంలో వీణ, మృదంగం తదితర కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. మరింత మంది విద్యార్థులకు భారతీయ కళలను చేరవేయాలన్న సంకల్పంతో తాన కళాశాల పనిచేస్తుందని తెలిపారు.

    అందరికీ కృతజ్ఞతలు..
    తానా కళాశాల ముఖ్య సలహాదారు రాజేశ్‌ అడుసుమిల్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కళాశాల కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల కోఆర్డినేటర్స్‌ వెంకట్‌ ఆవిర్నేని, రవీంద్ర చిట్టూరి, రమా ప్రత్తిపాటి మరియు తానా ప్రతినిధులు కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి, వెంకీ అడబాల, రామకృష్ణ వాసిరెడ్డి, నాగ పంచుమర్తి, పరమేశ్‌ దేవినేని, శ్రావణి సుధీర్‌ తదితరులు ఆయా నగరాల నుంచి సహకారం అందించారని తెలిపారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ కళాశాల ప్రోగ్రాంపై చూపిస్తున్న ఆదరణకు ముగ్దులైన తానా ప్రతతినిధులు ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.