https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది..నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!

ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం ఎటు పోయిందో విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. టాస్కులు పట్ల ఆమె సీరియస్ గా లేకపోవడం, ఎంతసేపు పృథ్వీ వెనుక తిరిగే దాని మీద పెట్టే శ్రద్ద ఆట మీద పెట్టకపోవడం వల్ల ఆమె ఓటింగ్ భారీగా పడిపోయింది. ఈ వారం నాగార్జున ఈమెకు ఫుల్ క్లాస్ పీకి ఆమెని సరిచేయకపోతే మరో రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 08:22 AM IST

    Bigg Boss Telugu 8(66)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత ఆదివారం ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున షో ముగించే ముందు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసుకోమని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి తెలియదు. నిన్ననే ఈ ఎలిమినేషన్ జరిగిపోయినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఈ వారం నామినేషన్స్ లోకి ఆదిత్య ఓం,మణికంఠ, నిఖిల్, నబీల్, నైనిక మరియు విష్ణు ప్రియా వచ్చారు. వీరిలో నిఖిల్ అందరి కంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు. ఆయన తర్వాత నబీల్ అతి తక్కువ మార్జిన్ తోనే రెండవ స్థానం లో ఉన్నాడు. విష్ణు ప్రియా కి మొదటి ఎపిసోడ్ నుండి నిఖిల్ తో సమానంగా ఓట్లు పడేవి. ఎందుకంటే ఆమెకు హౌస్ లోకి రాకముందు నుండే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం ఎటు పోయిందో విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. టాస్కులు పట్ల ఆమె సీరియస్ గా లేకపోవడం, ఎంతసేపు పృథ్వీ వెనుక తిరిగే దాని మీద పెట్టే శ్రద్ద ఆట మీద పెట్టకపోవడం వల్ల ఆమె ఓటింగ్ భారీగా పడిపోయింది. ఈ వారం నాగార్జున ఈమెకు ఫుల్ క్లాస్ పీకి ఆమెని సరిచేయకపోతే మరో రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వచ్చే వైల్డ్ కార్డు ఎంట్రీలు పాత సీజన్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్లకు ఫ్యాన్ బేస్ ఈమెకి మించే ఉంటుంది. కాబట్టి గేమ్ లో ఇక నుండి సీరియస్ గా లేకపోతే ఈమె మరో రెండు వారాల్లో వెళ్లిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆమె మూడవ స్థానంలో ఉంది. ఆమెతో సమానంగా మణికంఠ కూడా తక్కువ మార్జిన్ తో నాల్గవ స్థానం లో ఉన్నాడు.

    ఇక డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం ఆదిత్య ఓం, నైనిక మాత్రమే. వీళ్ళిద్దరిలో ఎవరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే సస్పెన్స్ పై ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి ఆదిత్య ఓం ని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వారం హౌస్ బాగా ఆడిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఆదిత్య ఓం. చీఫ్ గా నిఖిల్ ఆదిత్య ఓం కి గేమ్స్ ఆడే అవకాశం ఇచ్చాడు. ఆడియన్స్ లో కూడా ఆదిత్య ఓం కి మంచి పాజిటివ్ అభిప్రాయం ఉంది. హౌస్ మేట్స్ ఎవ్వరితో కూడా ఆదిత్య కి గొడవలు లేవు. ఇలా హౌస్ లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయం ఉండే కంటెస్టెంట్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వారిలో ఆదిత్య ఒకరు. కానీ తన మీద ఉన్న పాజిటివిటీ ని ఓట్లు గా మలుచుకోలేకపోయాడు ఆదిత్య ఓం, అందుకే పాపం ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.