https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పృథ్వీ,నబీల్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించిన ‘చీఫ్’ పోరు..చివరికి గెలిచింది ఎవరంటే!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక క్లాన్ గా, అలాగే రాబోయే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ ఇంకో క్లాన్ గా ఏర్పడి వచ్చే వారం నుండి టాస్కులు ఆడబోతున్నారట. ప్రస్తుతం ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ క్లాన్ కి చీఫ్ అయ్యేందుకు ఒక టాస్కుని నిన్నటి ఎపిసోడ్ లో ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. ఈ టాస్కులో కుక్క బొమ్మలు ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 08:18 AM IST

    Bigg Boss Telugu 8(65)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్క్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వైల్డ్ కార్డ్స్ ని హౌస్ మేట్స్ అడ్డుకునే ఈ టాస్క్ లో శక్తి టీం రెండు టాస్కులు గెలిచి రెండు వైల్డ్ ఎంట్రీలను తప్పించారు. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ రెండు క్లాన్స్ ని తొలగించి హౌస్ కి చీఫ్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెట్టాడు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక క్లాన్ గా, అలాగే రాబోయే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ ఇంకో క్లాన్ గా ఏర్పడి వచ్చే వారం నుండి టాస్కులు ఆడబోతున్నారట. ప్రస్తుతం ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ క్లాన్ కి చీఫ్ అయ్యేందుకు ఒక టాస్కుని నిన్నటి ఎపిసోడ్ లో ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. ఈ టాస్కులో కుక్క బొమ్మలు ఉంటాయి.

    ఆ కుక్క బొమ్మలకు కంటెస్టెంట్స్ పేర్లను తగిలిస్తారు. కుక్క అరుపుల సౌండ్ వినిపించినప్పుడల్లా హౌస్ మేట్స్ కుక్కలను పట్టుకొని ఏర్పాటు చేసిన ఒక క్లోజెడ్ స్పేస్ లోకి పరిగెత్తాలి. కంటెస్టెంట్స్ అందరూ అవతల కంటెస్టెంట్స్ పేర్లు తగిలించిన కుక్క బొమ్మలను మాత్రమే పట్టుకొని పరిగెత్తాలి. సొంత పేర్లు ఉన్న కుక్క బొమ్మలను పెట్టుకోకూడదు. ఎవరైతే చివర్లో పెరిగిస్తారో వాళ్ళు డేంజర్ జోన్ లోకి రావాల్సి ఉంటుంది. ఆ కంటెస్టెంట్ తో పాటు కంటెస్టెంట్ చేతిలో ఉన్న కుక్క బొమ్మపై ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు కూడా డేంజర్ జోన్ లోకి రావాల్సి ఉంటుంది. అలా వీళ్లిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలి అనేది ముందుగా చీఫ్ రేస్ నుండి తప్పుకున్న కంటెస్టెంట్ నిర్ణయిస్తాడు. అలా ఈ టాస్కు మొత్తం సాగుతుంది. కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా చీఫ్ రేస్ నుండి తొలుగుతూ చివరికి నిఖిల్, నబీల్, ప్రేరణ మిగులుతారు. ఈ ముగ్గురిలో ఎవరు చీఫ్ కంటెండర్స్ అవ్వాలి అనేది హౌస్ రేస్ నుండి తప్పుకున్న హౌస్ మేట్స్ అందరూ నిర్ణయిస్తారు.

    నిఖిల్ ని కంటెస్టెంట్స్ ఈ రేస్ నుండి తప్పించినట్టుగా రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో చూపిస్తారు. అందరూ ప్రేరణ ని చీఫ్ కంటెండర్ గా ఎంచుకున్నట్టు కూడా ఈ ప్రోమో లో చూపిస్తారు, కానీ నబీల్ కూడా మరో చీఫ్ కంటెస్టెంట్ గా ఎంచుకుంటారట. అది రేపటి ఎపిసోడ్ లో మనకి చూపిస్తారు. అదంతా పక్కన పెడితే ఈ టాస్కు జరిగే ముందు ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కులో అత్యధిక గేమ్స్ ని గెలిచినందుకు శక్తి టీం కి తమ టీం లో ఎవరినో ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్ అయ్యేందుకు అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. శక్తి టీం మొత్తం చర్చించుకొని పృథ్వీ ని చీఫ్ కంటెండర్ గా పంపిస్తారు. అలా రేపు పృథ్వీ, నబీల్ మరియు ప్రేరణ మధ్య టాస్కు జరుగుతుంది. ఈ ఉత్కంఠ పోరులో నబీల్ గెలుపొంది కొత్త చీఫ్ గా ఎంపిక అయ్యాడని టాక్.