spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: పవన్ కళ్యాణ్ క్రేజ్ ని గౌతమ్ వాడుకుంటున్నాడా..! యష్మీ ఆరోపణలలో...

Bigg Boss Telugu 8: పవన్ కళ్యాణ్ క్రేజ్ ని గౌతమ్ వాడుకుంటున్నాడా..! యష్మీ ఆరోపణలలో నిజానిజాలు ఎంత?

Bigg Boss Telugu 8: ఈ సీజన్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్, టైటిల్ రేస్ లోకి దూసుకొస్తాడని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. మొదటి వారం ఆయన నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు, సోషల్ మీడియా లో జరిగిన పోల్స్ లో అందరికంటే చివరి స్థానంలో ఉండేవాడు. గత సీజన్ లో 13 వారాలు హౌస్ లో కొనసాగిన కంటెస్టెంట్ కి ఇంత తక్కువ ఓటింగ్ పడుతుందేంటీ అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే వారం ఆయనకీ మెగా చీఫ్ టాస్క్ ఆడే అవకాశం వచ్చింది. ఒక్కడే 12 మంది కంటెస్టెంట్స్ ని ఓడించి మెగా చీఫ్ అయ్యాడు. ఆ ఒక్క టాస్క్ గౌతమ్ ఓటింగ్ గ్రాఫ్ ని మార్చేసింది. చివరి స్థానం లో ఉన్న అతన్ని టాప్ 2 స్థానం కి రీచ్ అయ్యేలా చేసింది. అయితే ఎందుకో ఆ వారం హౌస్ లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యినట్టు, మణికంఠ సేవ్ అయ్యినట్టు, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడం వల్లే గౌతమ్ ఈరోజు హౌస్ లో ఉన్నట్టు కావాలని ఉద్దేశపూర్వకంగా చూపించినట్టు ఆడియన్స్ కి అనిపించింది.

ఎందుకంటే ఆ వారం అంత అద్భుతంగా ఆడిన వ్యక్తికి ఓట్లు పడకుండా ఎలా ఉంటుంది?, ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది..?, బాగా అలోచించి చూస్తే గౌతమ్ లో ఫైర్ పెంచి అతన్ని అద్భుతంగా ఆడేలా చేయడానికే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే గౌతమ్ గేమ్ అప్పట్లో చిన్నగా గాడి తప్పుతూ ఉన్నింది. గేమ్ మీద ఫోకస్ తగ్గించి యష్మీ చుట్టూ తిరుగుతుండేవాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ స్ట్రోక్ ఇచ్చాడో, అప్పటి నుండి గౌతమ్ తన గేమ్ మొత్తాన్ని మార్చేసుకున్నాడు. ఇతర కంటెస్టెంట్స్ లాగ అతి చెయ్యడం, సానుభూతి డ్రామాలు వేయడం, గ్రూప్ గేమ్స్ ఆడడం, ఒక వ్యక్తి గురించి వెనుక చేరి తప్పుగా మాట్లాడడం, ఇలాంటివి ఏమి చేయలేదు. ఒక జెంటిల్ మ్యాన్ గా, పూర్తి ఫోకస్ తో, సోలో బాయ్ గా తన గేమ్ ని ఆడుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇది కొంతమంది కంటెస్టెంట్స్ కి అసలు నచ్చడం లేదు.

ముఖ్యంగా యష్మీ గౌతమ్ తుమ్మినా, దగ్గినా తప్పు లాగానే చూస్తుంది. గౌతమ్ కి ఎక్కువగా పంచెలు కట్టుకోవడం, ఎర్ర తువ్వాలు తలకి చుట్టుకోవడం బాగా అలవాటు. గత సీజన్ లో కూడా ఆయన ఇలాంటివి చేసాడు. అయితే యష్మీ ఇది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్ల కోసమే కెమెరాలకు కనిపించేట్టు చేస్తున్నాడని నభీల్ తో అంటుంది. వాస్తవానికి గౌతమ్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానియే. ఎన్నో సందర్భాలలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ని అనుసరించడంలో తప్పేమి ఉంది?, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లదే కదా?, అతను బిగ్ బాస్ రూల్స్ ఏమి బ్రేక్ చేయడం లేదు, తన సొంత ఆట ఆడుకుంటున్నాడు. హౌస్ లో నామినేషన్స్ గురించి మాట్లాడుకోవడమే బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధం. అలాంటిది యష్మీ , పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, నభీల్, విష్ణు ప్రియ, అవినాష్, రోహిణి, తేజ వీళ్లంతా నామినేషన్స్ గురించి గ్రూప్స్ గా మాట్లాడుకుంటూ టార్గెట్ చేసి వేస్తున్నారు. గౌతమ్ అలాంటిదేమి చేయలేదే?, తనకి నచ్చినట్టు ఉంటున్నాడు, అందులో తప్పేమి ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version