Mahanubhava : ఒక స్త్రీ తన భర్తతో సంతానం పొందలేకపోతే, మరొకరి శుక్రకణాలను ఉపయోగించి గర్భం దాల్చడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.. అంటే వేరొకరి శుక్రకణాన్ని స్వీకరించడం ప్రపంచంలో కొత్తేమీ కాదు.. మనకు కూడా కొత్త కాదు… స్పెర్మ్‌ను కృత్రిమంగా భద్రపరిచే సౌకర్యాలు… పురుషుడు ఎవరో తెలియకుండా, ఎలాంటి లైంగిక సంబంధం లేకుండా కేవలం బ్యాంకు నుంచి కొనుగోలు చేసి… బిడ్డలను కనడం ఈ మధ్య మామూలు అయిపోయిందే. ఇదంతా ఎందుకంటే ఓ సంతాన డాక్టర్ వందల మంది స్త్రీల కడుపులను పండించాడట. ఎంతో మందికి సంతాన భాగ్యం కల్పించాడట. ఆయనెవరు.. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం. ముందుగా యాభయ్యేళ్ల ఓ అమెరికా మహిళ తన అక్కతో సరదాగా మాట్లాడుతూ మాటల మధ్యలో మన తండ్రి మనకి నిజమైన తండ్రి కాదు తెలుసా అని అంటుంది. దీంతో చెల్లి షాక్ తింటుంది. అదేంటే అని మళ్లీ మళ్లీ అడుగుతుంది. అవును మన తల్లికి చాలాకాలం పిల్లలు కాకపోతే వీర్యదానం ద్వారా మనల్ని కన్నారు అని చెప్పింది. అప్పట్లోనే కృత్రిమ గర్భధారణ ద్వారా మనం పుట్టామని అక్క చెల్లికి చెబుతుంది. అలా చెప్పిన మహిళ పేరు జైమీ హాల్. తన తండ్రి మీద తనకెలాంటి ఫిర్యాదులు లేవు. వారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. కొన్నాళ్ల కిందటే వారి పేరెంట్స్ ఇద్దరూ మరణించారు. దీంతో చెల్లి తన జెనెటిక్ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది.
దీంతో 50ఏళ్ల కిందటి వాళ్ల తల్లి ప్రసూతి కాగితాలను బయటికి తీసింది. తల్లికి ప్రసవం చేసిన హాస్పిటల్, డాక్టర్ పేర్లున్నయ్, ఆ డాక్టర్ పేరు పీవెన్. ఇప్పటికి తను ఉన్నాడో లేడో.. మరెలా..? తన ద్వారా అయితే తన బయాలజికల్ ఫాదర్ వివరాలు తెలుస్తాయని భావించింది. ఆయన వివరాల కోసం వెతుకుతుంటే కొన్ని వెబ్‌సైట్ల ద్వారా తన వంశవృక్షాన్ని సెర్చ్ చేస్తుండగా డాక్టర్ పీవెన్ మనవడి ఆచూకీ దొరికింది. ఎందుకో డౌటొచ్చి డీఎన్ఏలను పోల్చి చూస్తే ఆ డాక్టర్ మనమడు, తను, అక్క.. ముగ్గురి డీఎన్ఏ ఒకటే అని తేలింది. ఇంకాస్త లోతుగా పరిశీలించింది. రెండేళ్లు కష్టపడింది హాల్. చివరకు తన తల్లికి ప్రసవం చేసిన డాక్టరే తన జెనెటిక్ ఫాదర్ అని కనుక్కుంది. అంటే ఆ డాక్టరే తల్లికి వీర్యదానం చేసిన వ్యక్తి. వెంటనే తనను కలుసుకోవడానికి వెళ్లింది. ఆ డాక్టర్ వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు. ఆయన్ని చూడగానే ఆమెలో ఏదో తెలియని భావోద్వేగం. తరువాత ఆయన చెప్పిన వివరాలు విని ఆశ్చర్యపోయింది.
ఆ డాక్టర్ వద్దకు చాలామంది వచ్చేవాళ్లట. రకరకాల సమస్యలతో సంతానం కలగడం లేదని బాధపడేవారట. కృత్రిమ గర్భధారణపై అప్పట్లో చాలా ప్రయోగాలు కొనసాగేవి. కౌంట్ తక్కువగా ఉండే వాళ్లకు తన వీర్యమే దానం చేసేవాడు. ఆ హాస్పిటల్‌లో పనిచేసే ఇతర డాక్టర్లు కొన్ని వందల మందికి వాళ్లే తండ్రులు. కొందరు తల్లులకు అసలు విషయమే చెప్పేవాళ్లు కాదు. సహజంగానే గర్భం వచ్చిందని ఆనందం వ్యక్తంచేసేవారు. తను చేసింది తప్పు కాదంటాడు ఆ డాక్టర్. సంతానలేమి మహిళలకు ఓ శాపం. ఓ మంచి ఉద్దేశంతోనే వాళ్ల బాధను తీర్చాననేది ఆ డాక్టర్ అభిప్రాయం. ఎవరిదో వీర్యం ఎందుకు..? ఎలాగూ వీర్యానికి దాత మీద ఆధారపడుతున్నప్పుడు తనయినా ఒకటే, బయటి వ్యక్తి అయినా ఒకటే అన్నది ఆయన అభిప్రాయం.
ప్రసూతివైద్యంలో ఆయన 40ఏళ్ల పాటు సేవలందించాడు. ఇలా ఎందరికి తను ‘జన్మనిచ్చాడో’ ఊహించుకోవచ్చు. దానికి లెక్కలు ఉండవు కదా. కానీ డాక్టర్‌గా తను చేసింది హేయమైన పని అంటుంది హాల్. ఆ అనైతిక చర్యను తను ఏ రకంగానూ సమర్థించుకోకూడదని చెప్పింది. ఆ డాక్టర్ చేసింది కరెక్టా..? కాదా..? అనైతికమేనా..? బీజం ఎవరిదైతేనేం, ఆమె క్షేత్రం, ఆమె సంతానం అనేది ఆయన పాయింట్. కొందరి అభ్యంతరం ఏమిటంటే..? ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ (కృత్రిమ గర్భధారణ) వల్ల పుట్టిన సంతానం తమ బయాలజికల్ ఫాదర్ వివరాలు తెలుసుకునే ప్రయత్నమే సరికాదు అని…! కొందరు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల మనోవేదన తప్పా మరొకటి ఉండదని వారి అభిప్రాయం. ఈ అమెరికన్ డాక్టర్ ఏకంగా 114 మంది పిల్లల కోసం వీర్యాన్ని దానం చేశాడట. ఆయన ఒక్కడే కాదు టెలిగ్రామ్ సీఈవో కొన్ని వందల మందికి వీర్యదానం చేసి బయోలాజికల్ ఫాదర్ అయ్యారు కూడా.