spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8 : సొంత టీం కి వ్యతిరేకంగా మణికంఠ ఆటలు..పృథ్వీ తో...

Bigg Boss Telugu 8 : సొంత టీం కి వ్యతిరేకంగా మణికంఠ ఆటలు..పృథ్వీ తో అనవసరపు గొడవ..మణికంఠ ప్రవర్తనలో అనూహ్య మార్పులు!

Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికి 50 లక్షల ప్రైజ్ మనీ ని ఇవ్వొచ్చు. ఎందుకంటే మణికంఠ లాంటి దారుణమైన కంటెస్టెంట్ ని భరించేందుకు చాలా ఓపిక, సహనం ఉండాలి. బహుశా బిగ్ బాస్ హిస్టరీ లోనే కాదు, బయట కూడా ఇలాంటి మనుషులని మనం ఎక్కడా చూసి ఉండమేమో. మనుషుల ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేయడం, ఆ తర్వాత వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకోవడం, జనాలకు హౌస్ మొత్తం తనని టార్గెట్ చేస్తున్నట్టుగా చూపించుకోవడం, తద్వారా ఓట్లు సంపాదించడం. ఇలాంటి కంటెస్టెంట్ ని కూడా నమ్మి ఓట్లు వేసే జనాలను చూస్తుంటే మన దేశం లో అవినీతి రాజకీయ నాయకులూ అంతలా ఉండడం లో తప్పే లేదు అనిపిస్తుంది. మొదటి నుండి మణికంఠ ఇలా ఎమోషన్స్ తో ఆదుకోవడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే 5 వారాలు మనం చూసిన మణికంఠ వేరు, ఈ వారం మనం చూస్తున్న మణికంఠ వేరు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి, నీకు సానుభూతి జనాల్లో బాగా పెరిగింది, ఓటింగ్ లో టాప్ లో ఉన్నావు అని ఆయనకీ చెప్పగానే, కొమ్ములు వచ్చేసాయి. ప్రతీసారి సొంత క్లాన్ సభ్యులతో గొడవలు పెట్టుకొని సానుభూతి పొందడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఈ వారం కూడా అదే చేస్తున్నాడు. నిఖిల్ అందరిని పిలిచి ఎలా మాట్లాడాలో చెప్తుంటే, నువ్వేమైనా మా క్లాన్ లీడర్ వా?, నీ మాట నేనెందుకు వినాలి అంటూ యాటిట్యూడ్ చూపించాడు. అలాగే పృథ్వీ తో అనవసరం గా రాత్రి సమయం లో గొడవపడ్డాడు. కాసేపటి క్రితమే విడుదలైన రెండవ ప్రోమో లో పృథ్వీ చాలా మర్యాదగా మణికంఠ తో తనకి ఏర్పడిన సమస్య గురించి మాట్లాడేందుకు వచ్చాడు. మణికంఠ గొంతు పెంచుతూ మాట్లాడడం మొదలు పెట్టాడు. గొంతు లేపాను నా మీద అని పృథ్వీ చెప్పగానే, నువ్వు ఎవడ్రా నాకు మర్యాదగా మాట్లాడమని చెప్పడానికి, నువ్వేమైనా డాన్ అనుకుంటున్నావా అంటూ అతనిపై రెచ్చిపోయాడు. సమస్య ఏమిటంటే ఇతని కన్నింగ్ గేమ్ ని అర్థం చేసుకొని హౌస్ మేట్స్ ఇతనికి కంటెంట్ ఇచ్చే స్కోప్ ని గత రెండు వారాలుగా తగ్గించేశారు.

ఇప్పుడు మనోడికి కంటెంట్ కావాలి, ఎంత ప్రయత్నం చేసిన హౌస్ మేట్స్ ఇతనికి కంటెంట్ రప్పించడం లేదు, రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ఉన్న పృథ్వీ ని రెచ్చగొట్టాడు. కావాల్సిన కంటెంట్ వచ్చింది, రాయల్ క్లాన్ మొత్తం చూడండి పాపం మణికంఠ మీద ఎలా మీద పడిపోతున్నారో అని అనుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి అక్కడ జరిగిన విషయం రాయల్ క్లాన్ వాళ్ళు చూడలేదు. వాళ్ళ బుర్రలో ఇలా ఎక్కించేసాడు ఈ డేంజరస్ కంటెస్టెంట్ మణికంఠ. ఇదంతా చూసి కూడా ఇతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఈ సపోర్ట్ తో, ఇలాంటి చిల్లర ఆటలతో టాప్ 5 వరకు రావొచ్చేమో కానీ, టైటిల్ మాత్రం కొట్టలేడు. ఇతని నీచమైన కన్నింగ్ ఆటని నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్ లో పసిగట్టి ఆపుతాడా లేదా అనేది చూడాలి.

 

Bigg Boss Telugu 8 | Day 46 - Promo 2 | Clash Among Over Smart Chargers Team | Star Maa

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version